ఎంగేజ్మెంట్‌, బ్రేక‌ప్ త‌ర్వాత ఫ‌స్ట్ టైం ఆ పేరు ఎత్తిన ర‌ష్మిక‌… !

ఛలో సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఛలో సూపర్ హిట్ కావడంతో ఆమె వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. అమె చేసిన ప్రతి సినిమా హిట్ కావడంతో ఇండస్ట్రీలో ఛాన్సుల‌కు కొరత లేకుండా పోయింది. సౌత్ ఇండస్ట్రీలోనే కాక బాలీవుడ్ లోనూ వ‌రుస అవ‌కాశాలు సొంతం చేసుకుంటోంది.

Reason Why Rashmika Mandanna Broke Her Engagement With Rakshit Shetty

ఇక ర‌ష్మిక‌కు మొద‌టిసారిగా పరంవ స్టూడియోస్ బ్యానర్లో కిర్రాక్ పార్టీ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆమె టాల‌వుడ్‌లోకి వ‌చ్చి వెనుదిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా దూసుకెళ్లింది. అయితే తరచూ ఏదో ఒక వివాదాలలో చిక్కుకుంటూ ఉండే రష్మిక.. ఆమెకు మొదటిగా సినిమా ఛాన్స్ ఇచ్చిన‌ వారి బ్యానర్ పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడేదే కాదు.

Rakshit Shetty & Rashmika Mandanna Engagement Photos - FilmiBeat

ప్రస్తుతం తనకు ఆ బ్యానర్ ద్వారా అవకాశం వచ్చిందని ఆ సినిమాలో నటించడం వల్లే తనకు నటిగా గుర్తింపు వచ్చిందని కామెంట్స్ చేయడం నెట్టింట వైరల్ అవుతుంది. కానీ గతంలో ఆమె మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన ఆ నిర్మాణ సంస్థ అధినేత, నటుడు రక్షిత్ శెట్టి ని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇక పెళ్లి అనుకుంటోన్న టైంలో బ్రేకప్ చేసుకుంది. ఈ కారణంగా తను మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన వారి బ్యానర్ పేరు గాని అతని పేరు గాని ఎత్తడానికి ఇష్టపడేది కాదు.

Kantara actor Rishab Shetty's lovely gesture over his friend Rashmika  Mandanna at South Movie Awards - YouTube

అటువంటి రష్మిక పరంబ స్టూడియోస్ వారు అవకాశం ఇవ్వడం వల్లే ఇండస్ట్రీకి వచ్చానని చెప్పడం తన ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాని ఇస్తుంది. ఇప్పటికైనా రష్మిక ఒక మెట్టు దిగి తన ఎదుగుదలకు కారణమైన వారి పేరును చెప్పడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు రష్మిక ఫ్యాన్స్.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Rashmika Mandanna, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news