జయమంగళ గెలిచాడు… కానీ వైసీపీకి జీరో బెనిఫిట్..!

మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత జయమంగళ వెంకటరమణ గెలిచారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా సరే ఎలాగోలా ఎమ్మెల్సీగా గెలిచి చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగు పెట్టారు. మరి ఎమ్మెల్సీగా గెలిచిన జయమంగళ వల్ల వైసీపీకి ఏమైనా ఒరిగేది ఉందా? అంటే చెప్పడం కష్టమే. వాస్తవానికి ఆయన సామాజికవర్గం వడ్డీలు..కృష్ణా, ఏలూరు పరిధిలో ఎక్కువ ఉన్నారు. ఆ వర్గం వైసీపీకి కలిసొస్తుందనే ఉద్దేశంతో ఆయన్ని…వైసీపీలోకి తీసుకున్నారు.

సీఎం జగన్‌తో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ భేటీ.. ఫిబ్రవరి 23న స్థానిక సంస్థల  కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్..!

అయితే అంతకముందు వరకు ఆయన టి‌డి‌పిలో పనిచేశారు. 2009లో కైకలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో సీటు దక్కలేదు. 2019 ఎన్నికల్లో సీటు దక్కినా గెలుపు దక్కలేదు. ఇంతకాలం టి‌డి‌పిలో పనిచేసి..అనూహ్యంగా వైసీపీ ఆఫర్ ఇవ్వడంతో అటు వెళ్లారు. వెంటనే ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డారు. అనూహ్యంగా టి‌డి‌పి అభ్యర్ధి వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేయడంతో..జయమంగళకు..అటు కోలా గురువులుకు ఒక్కో ఓటు తగ్గింది.

22 ఓట్లు కావాల్సి ఉండగా..ఇద్దరికి 21 చొప్పున పడ్డాయి. దీంతో రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించారు. ఈ క్రమంలో టి‌డి‌పి అభ్యర్ధికి మొదట ప్రాధాన్యత ఓటు వేసిన ఒక ఎమ్మెల్యే..రెండో ప్రాధాన్యత ఓటు జయమంగళకు వేశారు. దీంతో జయమంగళ గెలవగా, గురువులు ఓడిపోయారు. ఈ విధంగా చివరి నిమిషంలో జయమంగళ గెలిచారు. మరి ఎమ్మెల్సీగా గెలిచిన జయమంగళ వల్ల వైసీపీకి ఎంతవరకు బెనిఫిట్ అనేది చెప్పలేం.

ఆయన వర్గం ఓట్లు కొంతమేర వైసీపీకి రావచ్చు. అలా అని పూర్తిగా వచ్చే పరిస్తితి లేదు. ఎందుకంటే వడ్డీల్లో టి‌డి‌పిని అభిమానించే వారు ఎక్కువుగా ఉన్నారు. అందుకే వారి వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువుగా ఉన్న‌ దెందులూరు, కైక‌లూరు లాంటి సీట్లు టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాక‌పోయినా గెలిచిన సంద‌ర్భాలు ఉన్నాయి. పైగా టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే కృష్ణా, ఏలూరు, గోదావరి జిల్లాల్లో వైసీపీకి మామూలు షాకులు ఉండవు.

ఇక ఆయ‌న‌కు సొంతంగా వ‌ర్గం కానీ, బ‌లం అంటూ కూడా లేదు. ఓ విధంగా అవుట్ డేటెడ్ పాలిటిక్స్‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న జ‌య‌మంగ‌ళ‌కు ఎమ్మెల్సీ రావ‌డంతో ఆయ‌న ఆరేళ్ల పాటు ఈ ప‌ద‌విలో ఉండొచ్చే కానీ.. జయమంగళ వల్ల వైసీపీకి పెద్దగా ఒరిగేది ఏమి లేదు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp