ఓంకార్ అన్నియ్య మామూలోడు కాదుగా.. ఆ తెలుగు హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని చివరికి..!

ఓంకార్ ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తెలుగులో రియాలిటీ షోల‌కు ఓంకార్ పితామ‌హుడు అని చెప్పొచ్చు. అప్ప‌ట్లో ఆట అనే పేరుతో డ్యాన్స్ రియాలిటీ షో ను ఓంకాంర్ ప్రారంభించాడు. ఈ రియాలిటీ షో సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ఆట వ‌న్, టూ, త్రీ అంటూ సీజ‌న్ లు తీశారు. ఆ త‌ర‌వాత డైరెక్ట‌ర్ గా కూడా ఓంకార్ రెండు మూడు సినిమాలు చేశాడు. ప్రస్తుతం సెవెన్త్ సెన్స్ అనే టీవీ షోకు యాంక‌ర్ గా వ్యవ‌హ‌రిస్తున్నారు.

Interview : Nag sir gave me freedom and valued my decisions - Ohmkar | 123telugu.com

అయితే ఓంకార్ ను చాలా మంది అన్న‌య్యా అని పిలుస్తుంటారు. ఆయ‌న షో కు వ‌చ్చే వాళ్లు ప్రేమ‌గా ఓంకార్ అన్న‌య్యా అంటూ పిలుస్తారు. అంతే కాకుండా ఆయ‌న పై ట్రోల్స్ కూడా వ‌స్తుంటాయి. అయితే ఓంకార్ వాటిని ప‌ట్టించుకోకుండా త‌న పని తాను చేసుకుపోతుంటారు. కానీ అలాంటి ఓంకార్ ఓ హీరోయిన్ తో ల‌వ్ ఎఫైర్ న‌డిపిస్తున్నాడ‌ని ఆమెను పెళ్లి చేసుకుంటాడ‌ని వార్త‌లు రావ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది.

ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు తెలుగు అందం అంజ‌లి. ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్ర‌ల‌లో హీరోయిన్ గా న‌టించి అభిమానుల‌ను సంపాదించుకుంది. అయితే ఓంకార్ తో అంజ‌లి లవ్ ఎఫైర్ అనే రూమ‌ర్ లు ఎక్క‌డ నుండి పుట్టుకువ‌చ్చాయో గానీ అప్ప‌ట్లో ఈ వార్త‌లు మీడియాను షేక్ చేశాయి. దాంతో హీరోయిన్ అంజ‌లి ఈ వార్త‌ల‌పై స్పందించాల్సి వ‌చ్చింది. అంజ‌లి మాట్లాడుతూ….నిజంగా చెబుతున్నా ఓంకార్ ఎవ‌రో నాకు అస్స‌లు తెలియ‌దు.

Anjali admits her unfortunate relationship

గ‌తంలో కూడా ఆయ‌న‌ను నేను ఎప్పుడూ క‌ల‌వ‌లేదు. అల‌సు ఈ వార్త‌లు ఎక్క‌డ నుండి పుట్టుకొచ్చాయో కూడా నాకు అర్థం కాలేదు. రాజు గారి గది సీక్వెల్ నాద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. కానీ ఆ సినిమాను నేను ఒప్పుకోలేదు. అంటూ అంజలి చెప్పుకొచ్చింది. దాంతో అంజ‌లి తో ఓంకార్ ల‌వ్ ఎఫైర్ అంటూ వచ్చిన వార్త‌ల‌కు పులిస్టాప్ ప‌డింది. ఇక ఆ త‌ర‌వాత కూడా వీరిద్ద‌రి గురించి ఎలాంటి వార్త‌లు వినిపించ‌లేదు.

Tags: Anchor, film news, filmy updates, intresting news, latest news, latest viral news, omkhar, social media, social media post, star actter, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news