వామ్మో.. టబు ఇంత మందితో ప్రేమాయణం నడిపించిందా.. లిస్టులో ఇంతమంది హీరోలా..?

ఒకప్పటి టాలీవుడ్- బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోవాలని అందం ఈమె సొంతం. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి మంచి సినిమాలు పాత్రలు ఎంచుకుంటూ మరింత జోష్‌తో దూసుకుపోతుంది. రీసెంట్ టైమ్స్‌లో ఆమె అనుకున్నంత స్థాయిలో అవకాశాలు మాత్రం దకడం లేదు. అందుకే ప్రస్తుతం ఎక్కువగా హీరోయిన్లకు తల్లిగా చేయడానికి కూడా ఈమె రెడీ అయిపోయింది.

ఇదే సమయంలో ఈమెకు ఇంత వయసు వచ్చిన ఎప్పటికీ పెళ్లికి దూరంగా ఉన్న టబు మీద ఎప్పటినుంచో ఎన్నో రూమర్లు వస్తూనే ఉన్నాయి. వెంకటేష్ హీరోగా వచ్చిన కూలీ నెంబర్ వన్ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది టబు. సినిమాలో నటించే సమయానికి ఈమె వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే.. ఇక ఆ సమయంలోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించి అవకాశాలు అందుకుంది.

అలా సినిమాలు చేస్తున్న సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతో కలిసి పలు సినిమాల్లో నటించి అతడితో ప్రేమాయణం నడిపిందనే వార్తలు కూడా ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఇద్దరు దాదాపు 10 ఏళ్లపాటు ప్రేమలో ఉన్నారని నాగార్జున ఆమె కోసం హైదరాబాదులో సొంత ఫ్లాట్ ను కూడా గిఫ్ట్ గా ఇచ్చాడని కామెంట్లు కూడా వచ్చాయి. ఇక టబు తన కెరీర్లో ఒక నాగార్జునతో కాకుండా ప‌లువురు స్టార్ హీరోలతో కూడా ప్రేమాయణం నడిపిందనే వార్తలు ఉన్నాయి. అలా ట‌బు ప్రేమాయణం నడిపిన స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఇక తెలుగులో నాగ్‌తోనే కాకుండా మ‌రో స్టార్ హీరోతో కూడా ప్రేమ వ్యవహారం నడిపిందన్న వార్త‌లు ఇప్ప‌టికి వ‌స్తున్నే ఉన్నాయి. అంతే కాకుండా మ‌రో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ కపూర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఈమె ఆ త‌ర్వాత‌ సాజిద్ నడియ‌ద్ వాలాతో కూడా ప్రేమాయణం నడిపి మరొకసారి వార్తల్లో నిలిచింది. ఇక తర్వాత బాలీవుడ్ హీరో జయ్ దేవగన్ తో చిన్నతనం నుంచి చనువుగా ఉంటున్న ఈమె అతని కోసమో ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని వాదన కూడా ఉంది.

మరోవైపు జయ్ దేవగన్‌తో కలిసి ఇప్పటికే మూడు సినిమాల్లో చేసిన టబు.. మరో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయ్‌తో కూడా ప్రేమాయణం నడిపించిందట. ఇలా ఎంతో మంది అగ్ర హీరోలతో ప్రేమాయణం నడిపింది కానీ ఏ ఒక్కరిని పెళ్లి చేసుకోకపోవడం అందరికీ షాకింగ్ గా అనిపించింది. 50 సంవత్సరాలు దాటుతున్న ట‌బు ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి.