ఒక్క శ్రీలీల వల్ల ఆరుగురు హీరోయిన్ల కెరీర్ సర్వనాశనం.. అలా చేయడం వల్లే ఆఫర్లా?

టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులు, దర్శకనిర్మాతలు, హీరోలు ప్రస్తుతం శ్రీలీల నామజపం చేస్తున్నారు. శ్రీలీల నటిస్తే సినిమా హిట్ అనే కొత్త తరహా సెంటిమెంట్ ను తెరపైకి తెస్తున్నారు. రోషన్ పెళ్లిసందడి, ధమాకా సినిమాలతో హిట్లు ఖాతాలో వేసుకున్న శ్రీలీల తర్వాత సినిమాలతో కూడా ఇదే తరహా ఫలితాలను అందుకుంటుందని చెప్పలేం. పెద్దగా క్రేజ్ లేని హీరోలకు సైతం శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఒక్క శ్రీలీల వల్ల ఆరుగురు హీరోయిన్ల కెరీర్ సర్వనాశనం అయిందని తెలుస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ ఆరుగురు హీరోయిన్ల కెరీర్ ను శ్రీలీల ఒక విధంగా క్లోజ్ చేసిందనే చెప్పాలి. బాలీవుడ్ హీరోయిన్లను తమ సినిమాలలో తీసుకునేంత బడ్జెట్ లేని హీరోలంతా తమ సినిమాలలో శ్రీలీలకు ఛాన్స్ ఇస్తున్నారు. శ్రీలీల వల్ల నిండా మునిగిపోయిన హీరోయిన్ అంటే పూజా హెగ్డే అనే చెప్పాలి.

ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలను పూజా హెగ్డే వదులుకోవడానికి శ్రీలీల కారణమని ఇండస్ట్రీలో గాసిప్స్ గుప్పుమంటున్నారు. శ్రీలీల ఎంట్రీతో డ్యాన్స్ విషయంలో అదుర్స్ అనిపించుకున్న సాయిపల్లవికి సైతం ఆఫర్లు తగ్గాయి. తెలుగులో సాయిపల్లవి చేతిలో ఎక్కువ ఆఫర్లు లేవంటే శ్రీలీలే కారణమని తెలుస్తోంది. శ్రీలీల ఎంట్రీతో కృతిశెట్టి ఐరన్ లెగ్ అనే ఇమేజ్ ను ఖాతాలో వేసుకున్నారు.

శ్రీలీల చేతిలో 10 ప్రాజెక్ట్ లు ఉంటె కృతి చేతిలో ఒకటి, రెండు ప్రాజెక్ట్ లు మాత్రమే ఉన్నాయి. శ్రీలీల ఎఫెక్ట్ స్టార్ హీరోయిన్ సమంతపై భారీగా పడింది. సమంత కొత్త ఆఫర్లు రాకపోవడానికి ఈ బ్యూటీ కారణమని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇంతకాలం హద్దుల్లో ఉన్న తమన్నా శ్రీలీల ధాటికి ఇప్పుడు బోల్డ్ సిరీస్ లలో నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీలీల ఎంట్రీతో రష్మికకు సైతం ఆఫర్లు తగ్గాయి. ఒకే ఒక్క హీరోయిన్ ఆరుగురు హీరోయిన్ల కెరీర్ ను సర్వనాశనం చేసిందనే చెప్పాలి.