ఎన్టీఆర్ మీద ప్రేమ‌తో శ్రీదేవి త‌న ముంబై ఇంట్లో ఎంత ప‌ని చేసిందో తెలుసా..!

అన్న‌గారు.. ఎన్టీఆర్‌తో అనేక మంది హీరోయిన్లు న‌టించారు. అయితే.. కొంద‌రికి మాత్ర‌మే.. ఆయ‌న‌తో చ‌ను వు ఉన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. వీరిలోనూ.. ఒకే ఒక్క హీరోయిన్‌కు మాత్ర‌మే అన్న‌గారితో అనబంధం ఉంది. ఆమె శ్రీదేవి. నిజానికి అంజ‌లీదేవి, సావిత్రి వంటివారు ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాలు చేశారు. ఇక‌, జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ‌, వాణిశ్రీ వంటివారు కూడా అన్న‌గారితో క‌లిసి న‌టించారు.

Sridevi: Sridevi and NTR: The 40 year age gap!

అయితే.. శ్రీదేవి విష‌యానికి వ‌స్తే.. మాత్రం చాలా ప్ర‌త్యేకం అని అన్నగారే అనేక సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చా రు. దీనికికార‌ణం. శ్రీదేవితో అన్న‌గారి సినీ ప్ర‌యాణం ఏకంగా మూడు వ‌సంతాలు. అంటే.. 30 ఏళ్ల‌పాటు అన్న‌గారు శ్రీదేవితో క‌లిసి న‌టించారు. బాల న‌టిగా ప్ర‌యాణం సాగించినప్ప‌టి నుంచి కూడా శ్రీదేవితో అన్న‌గారు ఎన్టీఆర్‌కు ఎంతో సాన్నిహిత్యం ఉంది. బ‌డిపంతులు సినిమాలో కుమార్తెగా న‌టించినా.. శ్రీదేవి.. త‌ర్వాత‌.. హీరోయిన్గా న‌టించింది.

ఎన్టీఆర్ తో శ్రీదేవి..అప్పట్లోనే రికార్డ్ ! | Sridevi memorable movies with  NTR - Telugu Filmibeat

వీరు న‌టించిన వేట‌గాడు సినిమా.. ఎవ‌ర్ గ్రీన్ అనే చెప్పాలి. అంతేకాదు.. ఎన్టీఆర్‌తో కుటుంబ నేప‌థ్యాన్ని పంచుకున్న ఏకైక హీరోయిన్ కూడా శ్రీదేవి కావ‌డం గ‌మ‌నార్హం. తెలుగు సినిమాల్లో మంచి ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలోనే.. శ్రీదేవి.. హిందీ సినిమాల‌వైపు.. వెళ్లారు. దీనికి కార‌ణం అన్న‌గారేన‌ని ఒక సంద‌ర్భంలో ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు చెప్పారు. అంతేకాదు.. శ్రీదేవికి అన్న‌గారంటే.. ఎన‌లేని అభిమాన‌మ‌ని తెలిపారు.

ఎన్టీఆర్ తో శ్రీదేవి..అప్పట్లోనే రికార్డ్ ! | Sridevi memorable movies with  NTR - Telugu Filmibeat

“శ్రీదేవి బొంబాయిలో ఇల్లుక‌ట్టుకుని.. గృహ ప్ర‌వేశానికిఆహ్వానించింది. నేను వెళ్లాను. ఏదో సాధార‌ణ‌మే అనుకున్నాను. కానీ, ఇంట్లో హాల్లో నిలువెత్తు అన్న‌గారి ఫొటో అది కూడా కృష్ణుడి రూపంలో ఉన్న పెద్ద ఫొటో చూసి ఆశ్చ‌ర్య‌పోయాను“ అని రాఘ‌వేంద్ర‌రావు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇలా.. అన్న‌గారితో ఎంతో మంది న‌టించినా.. శ్రీదేవి మాత్రం ప్ర‌త్యేక‌మ‌ని చెప్పుకొచ్చారు.

Tags: filmy updates, intresting news, latest news, latest viral news, ntr, social media, social media post, sridevi, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news