సినిమా ఎలా తీయ‌కూడ‌దో ‘ ఏజెంట్ ‘ పెద్ద ఉదాహ‌ర‌ణా…థ్యాంక్స్ టు సురేంద‌ర్‌రెడ్డి..!

ఎస్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే టాక్ వినిపిస్తోంది. సినిమా రంగంలో వ్యాపారం, మంచిత‌నం అనేవి ఎప్పుడూ సెట్ కావ‌నే అంటారు. నిర్మాత అనేవాడు అన్నీ తానై చూసుకోవాలి… ద‌ర్శ‌కుడిని ఎప్పుడూ గుడ్డిగా న‌మ్మి మోస‌పోకూడ‌దు. అందులో సురేంద‌ర్ రెడ్డి లాంటి వాడిని అస్సలు న‌మ్మ‌కూడ‌దు. సురేంద‌ర్ రెడ్డికి బ‌డ్జెట్ మీద అస్సలు కంట్రోల్ ఉండ‌దు.

Surender Reddy Movies List | Film Director

సినిమాను బాగా చెక్కుతూ టైం టేకింగ్‌తో పాటు చాలా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో నిర్మాత‌ల‌ను, న‌మ్మి అవ‌కాశాలు ఇచ్చిన హీరోల‌ను నిలువునా ముంచేస్తాడ‌నే పేరుంది. ఎన్టీఆర్ గుడ్డిగా న‌మ్మి అశోక్‌, ఊస‌ర‌వెల్లి రెండు సార్లు ఛాన్సులు ఇస్తే యూజ్ చేసుకోలేదు. మ‌హేష్ అతిథి ఛాన్స్ ఇస్తే అట్ట‌ర్ ప్లాప్‌. ఆ సినిమా దెబ్బ‌తో మ‌హేష్ ఏకంగా మూడున్న‌రేళ్ల పాటు సినిమాలే చేయ‌లేదు.

అంత గొప్ప టాలెంట్ ఈ సురేంద‌ర్‌రెడ్డిది. ఇక కిక్ 2 సినిమాను క‌ళ్యాణ్‌రామ్ పూర్తిగా సురేంద‌ర్ రెడ్డిని గుడ్డిగా న‌మ్మేసి మొత్తం బాధ్య‌త‌లు మ‌నోడిమీదే పెట్టేశాడు. ఆ రోజుల్లోనే ఆ సినిమాకు రు. 40 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ని టాక్‌? సినిమా అట్ట‌ర్ ప్లాప్‌. క‌ళ్యాణ్‌రామ్ నిలువునా మునిగిపోయాడు. ఆ అప్పులు తీర్చేందుకు క‌ళ్యాణ్‌కు ప‌దేళ్లు ప‌ట్టింది.

SurenderReddy on Twitter: "Shoot Begins!! @AkhilAkkineni8 @AnilSunkara1  @MusicThaman @VamsiVakkantham @AKentsOfficial @S2C_Offl #Agent  https://t.co/0hGutnJZ6A" / Twitter

ఇక సైరా సినిమాకు కూడా బ‌డ్జెట్ మ‌రీ ఓవ‌ర్ అయిపోయింది. ఆ సినిమా కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా లాస్‌. గ‌త కొన్నేళ్ల‌లో సురేంద‌ర్ రెడ్డి తీసిన సినిమాల్లో ఒక్క ధృవ‌.. అది కూడా రీమేక్ కాబ‌ట్టే ఓ మోస్త‌రుగా ఆడింది. ఇక ఏజెంట్ సినిమా మూడేళ్ల నుంచి న‌డుస్తూనే ఉంది. అస‌లు ఈ సినిమా టైమ్, బడ్జెట్ ఇలా చాలా విషయాల్లో టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోతుంద‌ని… ఓ డైరెక్ట‌ర్‌ను నిర్మాత ఎలా గుడ్డిగా న‌మ్మ‌కూడ‌దో చెప్పేందుకు ఏజెంట్ పెద్ద ఉదాహ‌ర‌ణ అని టాలీవుడ్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి.

ఈ విష‌యంలో డైరెక్ట‌ర్ డైరక్టర్ సురేందర్ రెడ్డికి ఇండ‌స్ట్రీ పెద్ద ధ్యాంక్స్ చెప్పుకోవాల‌ని అంటున్నారు. రేపు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయితే త‌ప్పా ఎవ్వ‌రూ బ‌య‌ట ప‌డే ప‌రిస్థితి లేదు. ఇక నైజాంలో ఈ సినిమాను ఇప్ప‌ట‌కీ ఎవ్వ‌రు కోనేందుకు ముందుకు రాని ప‌రిస్థితి. ఏదేమైనా సురేంద‌ర్‌రెడ్డిని న‌మ్మితే మామూలుగా ముంచ‌ట్లేదు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news