NTR 30 రిలీజ్‌పై కొత్త రూమ‌ర్లు… ఇలా అయితే ఫ్యాన్స్‌కు మండిపోతోంది తార‌క్‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత ఏకంగా ఏడాది పాటు గ్యాప్ తీసుకోవడం ఎవరికి నచ్చలేదు. అసలు ఎన్టీఆర్ అభిమానులు అయితే త్రిపుల్ ఆర్‌ రిలీజ్ అయ్యి యేడాది అవుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవ్వాలి.. ఇంత గ్యాప్ తీసుకుని మమ్మల్ని నిరాశపరిస్తే ఎలా ? అని కామెంట్లో పెడుతున్నారు. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 30వ సినిమా ఎట్టకేలకు ఊరిస్తూ షూటింగ్ ప్రారంభమైంది.

ప్రస్తుతం హైదరాబాదులో రెండో షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్ జాహ్నవి కపూర్, విల‌న్‌గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ముందు నుంచి అనుకుంటున్నట్టుగా కాకుండా.. కాస్త ఆలస్యంగా మొదలైంది. ఇప్పుడు కూడా అనుకున్నంత స్పీడ్ గా జరగటం లేదు. దీంతో ముందుగా చెప్పినట్టుగా వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ అవుతుందా ? లేదా అన్న అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా అందుతున్న ఆఫ్ ది రికార్డ్ సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా నడుస్తుంది. ఈ క్రమంలోనే కొరటాల శివ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కోసం చాలా టైం తీసుకుంటారని అంటున్నారు. అదే జరిగితే ముందుగా చెప్పిన రిలీజ్ డేట్ కు రిలీజ్ కావటం కష్టమే. అదే జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరి కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను బాగా నిరాశ పరుస్తోంది.

NTR 30: Janhvi Kapoor's new Tollywood movie will launch soon; all details  about the movie - TechnoSports Media Group

కొర‌టాల బాగా లేట్ చేస్తుండ‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బాగా మండిపోతోంది. అయితే గ‌తంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వ‌చ్చిన జనతా గ్యారేజ్ మాదిరిగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం అయితే ఫ్యాన్స్ లో ఉంది. ఆ ఆశ‌ల‌తోనే ఎంత లేట్ అవుతున్నా వెయిట్ చేస్తున్నారు.