వైఎస్‌. సునీత‌కు ఆ టిక్కెట్ క‌న్ఫార్మ్ చేసిన చంద్ర‌బాబు ?

ఏపీలో రాజకీయ పరిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. అధికార వైసిపికి రోజుకొక కొత్త ఇబ్బంది ఎదురవుతుంది. ఇప్పటివరకు ఎదురులేదు అనుకున్న వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదలైన పరాజ‌యాల పరంపర ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలోను కంటిన్యూ అయింది. ఇక ఇప్పుడు సీఎం జగన్ సొంత బాబాయ్ వివేక హత్య కేసు వరుస అరెస్టులతో అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ కేసులో పార్టీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయంపై రకరకాల ఆరోపణలు వస్తున్నాయి.

YS Viveka's Daughter Suspects Threat, Seeks Police Protection

ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు అయ్యారు. అవినాష్ రెడ్డి కూడా అరెస్టు అయితే వైసిపికి కడప జిల్లాలో రాజకీయంగా కూసాలు కదిలిపోయే పరిస్థితి వస్తుందని అంటున్నారు. తండ్రి వివేక హత్య కేసులో కుమార్తె సునీత చేస్తున్న న్యాయపోరాటానికి ప్రతిపక్షాలతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మద్దతు అందుతున్న వాతావరణమే ఉంది. పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి వైఎస్ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ కూడా మంచి స్నేహితులు అని.. ఈ స్నేహం కూడా ఇప్పుడు వైసీపీకి ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే పులివెందులతో పాటు కడప లోక్‌స‌భ పరిధిలో వివేకానంద రెడ్డికి మంచి పేరు ఉంది. ఆయన పులివెందుల ఎమ్మెల్యే గాను.. కడప ఎంపీగా గతంలో గెలిచారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టిడిపి సునీతను పార్టీలోకి ఆహ్వానించి.. ఎంపీ అవినాష్ రెడ్డి మీద టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని భావిస్తోంది. కడప జిల్లా వ్యాప్తంగా వివేకాకు ఉన్న మంచి పేరు నేపథ్యంలో ఆయన దారుణ హత్యను జిల్లా ప్రజానికం తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సునీత పట్ల పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తం అవుతుంది.

సునీతకు కడప ఎంపీ సీటు ఇస్తే వివేకాకు న్యాయం చేయడంతో.. పాటు ఆ కుటుంబాన్ని ఆదుకున్నట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. సునీత అపోలో హాస్పిటల్ లో బాగా ఫేమస్ డాక్టర్. ఆమెకు రాజకీయ ఆకాంక్ష లేకపోయినా భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి మాత్రం ఉందని అంటున్నారు. ఆయనకు తెలుగుదేశం నేతలతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. పైగా సునీత భర్త రాజశేఖర్ రెడ్డి వైసీపీలో ఉన్న రాజకీయంగా ఎదిగే అవకాశం లేదు. అందుకే ఆ కుటుంబానికి టిడిపి కండువా కప్పి వైసిపిని రాజకీయంగా దెబ్బ కొట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్టే కనిపిస్తోంది.