ఈ సంవత్సరం సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి మరియు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కించగా.. చిరంజీవి నటించిన సినిమాని బాబి తెరకెక్కించాడు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలు కూడా ఒక్కరోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.
ఈ రెండు సినిమాల్లో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా.. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. అయితే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించడం మరో విశేషం. ఈ రెండు సినిమాల కలెక్షన్ల విషయంలో మాత్రం వాల్తేరు వీరయ్య పై చేయి సాధించింది. అయితే తాజాగా వీర సింహారెడ్డి 100 రోజుల కలెక్షన్స్ గ్రాండ్‌గా చేయాలని సినిమా యూనిట్ నిర్ణయించింది.
ఈ క్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని పోస్టర్లు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి. సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అంటూ పోస్టర్ వేసారు. నందమూరి బాలకృష్ణ రోరింగ్ బ్లాక్ బస్టర్ హండ్రెడ్ డేస్ అనే పోస్టర్ మీద సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అంటే 100 రోజులు సింగిల్ హ్యాండ్ తో సినిమాని ఆడించాడు అని అర్థం వచ్చేలా పోస్టర్లు ఉండటం కలకలం రేపింది. కచ్చితంగా ఇది చిరంజీవి- రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకి కౌంటర్ గానే ఈ పోస్టర్లు ముద్రించారు అంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.’
ఒక్కటి మాత్రం నిజం. రవితేజ వాల్తేరు వీరయ్యకు చాలా చాలా ప్లస్ అయ్యాడు. అప్పటికే ధమాకా సినిమాతో హిట్ కొట్టి ఫామ్‌లో ఉండడంతో ఆ క్రేజ్ ఇక్కడ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఈసినిమా వంద రోజులు పంక్షన్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హిందూపురంలో ఈ నెల 23న వంద రోజుల వేడుక జరుగనుందని సమాచారం తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది ? అనేది ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.