మ‌ళ్లీ ప‌రువు పోగొట్టుకున్న మంచు ఫ్యామిలీ… ఈ సారి ఏం జ‌రిగిందంటే..!

కారణం ఏదైనా ? మంచు ఫ్యామిలీలో ఇటీవల జరిగిన పరిణామాలు ఆ ఫ్యామిలీ పరువును బజారుకు ఈడ్చేశాయి. మంచు విష్ణుతో ఘర్షణకు సంబంధించి తాజాగా మీడియా అడిగిన ప్రశ్నకు మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ మాట దాటవేశారు. తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఇద్దరు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ హైదరాబాదులో కట్టాల్సిన ఆసుపత్రి తిరుపతిలో కట్టారని.. సకల సదుపాయాలు కల్పించారని తెలిపారు.

ఇటీవల వివాదంపై మోహన్ బాబును విలేకరులు ప్రశ్నిస్తే ? మీ ఇంట్లో నీ భార్యకు.. నీకు సంబంధం ఏంటో చెప్పగలవా ? అంటూ విలేకరిని ఎదురు ప్రశ్నించారు. మీడియా సోదరులు అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఎప్పుడు ఏది ? అడగాలో అదే అడగాలని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మంచు మనోజ్ కూడా మీడియాతో చాలా సెటైర్ గా మాట్లాడారు. రీసెంట్ ఇష్యూపై స్పందించాల‌ని ఓ విలేక‌రి అడిగితే భుజంపై సెగ్గడ్డ వచ్చింది. ఇదే రీసెంట్ ఇష్యూ వచ్చి గోగుతారా ? అని నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

అయితే దీనిపై మనోజ్ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా కొద్ది రోజులుగా మనోజ్ – విష్ణు మధ్య గొడవలు జరుగుతున్నాయి. విష్ణు – మనోజ్ ఉన్న బంధువుల ఇంట్లో గొడవకు వెళ్లిన వీడియో వైరల్ అవ్వటం.. ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి హౌస్ ఆఫ్ మంచు ఫ్యామిలీ అని ఒక ఫేక్ వీడియో విష్ణు రిలీజ్ చేయడం జరిగింది. తాజాగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ అందరికీ తెలిసిపోయింది. దీనిపై స్పందించమని అడిగితే అటు మోహన్ బాబు.. ఇటు మ‌నోజ్‌ ఇద్దరు హుందాగా వ్యవహరించాల్సింది పోయి.. అసందర్భంగా మాట్లాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వారిని మరింత పలుచ‌న చేస్తోంది.

I am the one who wants BJP to be in power at centre, says Mohan Babu

మనోజ్ ఎప్పుడు అందరితో స్నేహంగా ఉంటాడు అన్న మంచి పేరు ఉంది. మనోజ్ కూడా తనని తానే చులకన చేసుకుంటున్నాడా ? అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. మోహన్ బాబు ఫ్యామిలీలో మోహన్ బాబు – విష్ణు – లక్ష్మితో పోల్చుకుంటే మనోజ్‌పై ట్రోలింగ్ పెద్దగా ఉండదు. మరి ఇప్పుడు మనోజ్ కూడా ఈ తరహా కామెంట్లు చేయడంతో అతడు కూడా అనవసరమైన ట్రోలింగ్‌కు గురికావాల్సి వస్తుంది. ఏది ఏమైనా మంచి ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో అన్ని వర్గాలలోను బాగా నెగిటివిటీ అయితే పెరిగిపోతోంది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, manchu family, manchu manoj, manchu vishnu, mohanbabu, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news