మెగా అంటేనే లైట్ అంటోన్న బ‌న్నీ… రిట‌ర్న్ గిఫ్ట్ రెడీ చేస్తోన్న మెగాస్టార్‌..!

ఏదేమైనా అల్లు అర్జున్ తనకు మెగా బ్రాండ్ అక్కర్లేదని.. తనకంటూ ఓ సొంత బ్రాండ్ వచ్చేసిందని బలంగా డిసైడ్ అయినట్టే కనిపిస్తోంది. అసలు గత ఐదారేళ్ళుగా బన్నీ మెగా ఫ్యామిలీకి దూరంగా తన కంటూ సొంత అభిమానగ‌ణం ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు. ఎప్పుడో రుద్రమదేవి సినిమా ఫంక్షన్ లో పవన్ గురించి మాట్లాడమని అభిమానులు గోల చేస్తుంటే చెప్పను బ్రదర్ అనడంతోనే మెగా అభిమానుల్లో మంట పెట్టేసాడు. ఆ తర్వాత కూడా బన్నీ ఎక్కడా వెనక్కు తగ్గలేదు ఇక గత రెండు మూడేళ్లుగా ఏఏ, అల్లు అర్జున్ ఆర్మీ అంటూ ఒక ప్రత్యేకమైన అభిమాన గణం ఏర్పాటు అవుతుంది.

Chiranjeevi Like Godly Figure For Allu Arjun': Allu Aravind Rubbishes Rift

మెగా బ్రాండ్ కు దూరంగా న్యూట్రల్ గా వెళుతున్నాడు బ‌న్ని. అలాగే నందమూరి హీరోలు బాలయ్య, ఎన్టీఆర్ కు దగ్గరవుతూ వస్తున్నాడు. ఇది కూడా మెగాభిమానుల‌కు న‌చ్చ‌ట్లేదు. రంగస్థలం సినిమాతో చ‌ర‌ణ్‌ సెట్ చేసిన రికార్డులను అలవైకుంఠపురంలో సినిమాతో తుడిచి పెట్టేశాడు. ఇక పుష్ప సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయాడు. పుష్ప సినిమాతో చరణ్ కంటే ముందుగానే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

ఇప్పుడు చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు. పైగా చరణ్ కు బలవంతంగా గ్లోబల్ స్టార్ అనే కొత్త టైటిల్‌ ఆపాదించే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇప్పుడు బన్నీ పుష్ప 2 సినిమాతో త్రిబుల్ ఆర్ రికార్డులకు కూడా చెక్ పెట్టాలని కసితో ఉన్నట్టు తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ సినిమాపై ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రశంస వర్షం కురిపించారు. అయితే బన్నీ మాత్రం పెద్దగా స్పందించలేదు.

Chiranjeevi, Pawan Kalyan to Ram Charan, Allu Arjun, Sai Dharam Tej and  More: The Allu-Konidela Family of Telugu Cinema

తాజాగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా చాలామంది సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పారు. ఈసారి బాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా చరణ్ కు భారీగా శుభాకాంక్షలు వచ్చాయి. అయితే సొంత బావ బన్నీ మాత్రం విషెస్ చెప్పలేదు. ఒకవేళ ఫోన్లో చెప్పాడో లేదో తెలియదు. అదే అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబితే ఈరోజు ఇన్ని అనుమానాలు తలెత్తేవే కాదు. దీంతో గత కొద్దిరోజులుగా చరణ్ – బన్నీ మధ్య ఏదో జరుగుతుందన్న ? ప్రచారానికి ఇది మరింత ఊతం ఇచ్చినట్లయింది.

మెగా కాంపౌండ్ హీరోలు సాయి ధ‌ర‌మ్ తేజ్, వరుణ్ తేజ్ వీళ్లంతా చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అల్లు శిరీష్ కూడా శుభాకాంక్షలు చెప్పాడు. కానీ బన్నీ మాత్రం రియాక్ట్ కాలేదు. పోనీ బన్నీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేడా అంటే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిన్న‌టికి 20 ఏళ్లు అవడంతో దానిపై ట్వీట్ చేశాడు. ఎక్కడా చిరంజీవి ప్రస్తావన కూడా లేదు. బన్నీ హీరోగా ఎదగటానికి ప్రారంభంలో మెగా అభిమానులు బాగా సపోర్ట్ చేశారు. చిరంజీవి కూడా సాయం చేశాడు.

Ram Charan and Allu Arjun Relation, Childhood Photos

అయితే చిరంజీవి పేరు.. మెగా ఫ్యామిలీ పేరు బన్నీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఏది ఏమైనా బన్నీ వ్య‌వహ‌రిస్తున్న తీరు చిరంజీవికి కూడా నచ్చటం లేదని.. ఇప్పుడు చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి బన్నీ కంటే చరణ్ ను మరింత స్టార్ హీరోగా నిలబెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారని.. బన్నీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చిరంజీవి కసితో ఉన్నారని.. మెగా అభిమానుల్లో చర్చ అయితే నడుస్తోంది. మరి ఈ వివాదం ఎటు ? మలుపులు తిరిగి ఎటు వెళుతుందో చూడాలి. అయితే అటు బన్నీకి సపోర్టుగా తండ్రి అల్లు అరవింద్ కూడా సర్వశ‌క్తులు ఒడ్డుతున్న విషయం తెలిసిందే.

Tags: allu arju, film news, filmy updates, Icon Star Allu Arjun, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news