ఆర్తీ అగ‌ర్వాల్‌ను ఆ ఒక్క కార‌ణంతోనే త‌రుణ్ త‌ల్లి కోడ‌లిగా ఒప్పుకోలేదా ?

టాలీవుడ్ లో రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్ ఆర్తి అగర్వాల్ అంటే ఒక సంచలనం. వెంకటేష్ హీరోగా కే విజయభాస్కర్ దర్శ‌క‌త్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఆర్తి తొలి సినిమా సూపర్ డూపర్ హిట్. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా 57 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. అంత బ్లాక్ బస్టర్ విజయంలో సగం పాత్ర‌ ఆర్తి అగర్వాల్‌ది ఉందనే అంటారు. ఆమె అందచందాలు అప్పట్లో కుర్ర కారును.. కాలేజీ స్టూడెంట్స్ ను, మహిళా ప్రాక్షకులను ఒక ఊపు ఊపేసాయి.

Tarun and Aarthi Agarwal Pictures Remind Happy Memories Of Chemistry In  Nuvu Leka Nenu Lenu

ఆర్తి – వెంకీ మధ్య వచ్చే సన్నివేశాలు.. సినిమాలో ఆర్తి చేసిన చిలిపి పనులు, వెంకటేష్ తో ప్రేమ సన్నివేశాలు.. ఆమె నటించిన తీరు చాలామందికి బాగా నచ్చేసింది. అసలు తొలి సినిమాతోనే ఆమెకు ఎంతోమంది ఫిదా అయిపోయారు. రెండో సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తరుణ్ హీరోగా నువ్వు లేక నేను లేనులో నటించింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్. ఆ తర్వాత మూడేళ్లపాటు ఆర్తి తెలుగులో అందరు స్టార్ హీరోలతో నటించి ఎన్నో సూపర్ హిట్లు కొట్టేసింది.

ఆర్తీతో ప్రేమ లేదు: తరుణ్‌ | Tarun condemns his love story with Arthi  Agarwal - Telugu Oneindia

తన రెండో సినిమా హీరో తరుణ్ తో పీకల్లోతు ప్రేమలో పడిన ఆర్తి అతనితో కలిసి పిచ్చపిచ్చగా తిరగడంతో పాటు బాగా ఎంజాయ్ చేసిందని టాక్ అప్పట్లో వినిపించింది. వెండితెరపై వారిద్దరికీ కెమిస్ట్రీ బాగుందని భావించిన నిర్మాత సురేష్ బాబు తన బ్యానర్లో వచ్చిన సోగ్గాడు సినిమాలోను మరోసారి తరుణ్ – ఆర్తి కాంబినేషన్ రిపీట్ చేశారు. ఈ రెండు సినిమాల మధ్యలో రెండేళ్లపాటు తరుణ్ – ఆర్తీ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి వచ్చేసారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు అయితే తరుణ్ తల్లి రోజారమణికి ఆర్తి తన ఇంటికి కోడలుగా రావడం ఇష్టం లేదు. ఈ విషయం ఆర్తిని పిలిచి ముఖం మీద ఓపెన్ గా చెప్పేసింది.

Hero interested on hot divorced heroine! | cinejosh.com

అలాగే నన్ను కాదని ఆర్తిని వివాహం చేసుకుంటే.. ఈ తల్లి లేదని అనుకో నన్ను మర్చిపో అని కూడా తరుణకు ఖ‌రాకండిగా చెప్పేశార‌ట‌. దీంతో తరుణ్ తల్లి ప్రేమను వదులుకోలేదు. ఆర్తికి బలవంతంగా గుడ్ బై చెప్పేసాడు. దీంతో ఆమె హృదయం బద్దలైంది. రోజా రమణి తన ఇంటికి ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి కోడలుగా రావాలని అనుకుందే తప్ప.. తన కొడుకు ప్రేమను అర్థం చేసుకోలేదు. బాధాకరం ఏంటంటే ఆర్తీ వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడంతో పాటు ఆమె ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తరుణ్ వయసు 40 ఏళ్లు దాటుతున్న ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు.

Tags: arthi agarwal, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, tarun, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news