జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆడపిల్ల‌ను ద‌త్త‌త తీసుకోవ‌డ‌మా… ఇప్పుడు ఇదేం ట్విస్టు బాబోయ్‌..!

ఈ టైటిల్ చూడడానికే విచిత్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇదే విషయంపై ఎన్టీఆర్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతికి 2011లో పెళ్లి జరిగింది. లక్ష్మీ ప్రణతికి చాలా చిన్న వయసులోనే ఎన్టీఆర్ తో పెళ్లి జరగాక ఈ దంపతులకు భార్గవ్ రామ్, అభయ్ రామ్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. తన తాతపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఎన్టీఆర్ ఇద్దరు కొడుకుల పేరు చివర రామ్ వచ్చేలా పేర్లు పెట్టుకున్నాడు.

ఎన్టీఆర్ కు ముందు బాబు పుట్టటం ఇష్టం.. ఎందుకంటే ? తన తాత పేరు త‌న కొడుకుకి పెట్టుకోవాలన్నదే ఎన్టీఆర్ కోరిక. ముందు బాబు పుట్ట‌డం.. తన తాత పేరు రామ్ కలిసి వచ్చేలా పేరు పెట్టడం జరిగాయి. అయితే ఎన్టీఆర్ కు రెండో బిడ్డగా ఆడపిల్ల పుడితే బాగుంటుందన్న కోరిక బలంగా ఉండేదట. ఎన్టీఆర్ కు ముందు నుంచి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా రెండో కాన్పులో తనకు ఆడపిల్ల పుడుతుందని అనుకునేవాడట.

Happy Birthday Jr NTR: Adorable family moments of RRR actor with wife  Lakshmi Pranathi and sons (In Pics) | Celebrities News – India TV

అయితే భార్య లక్ష్మీ ప్రణతికి మాత్రం రెండోసారి కూడా బాబే పుట్టాలని కోరిక ఉండేదట. చివరకు లక్ష్మీ ప్రణతి కోరిక నెరవేరింది. చాలా సందర్భాలలో ఎన్టీఆర్ రెండో సంతానం కూడా కొడుకు పుట్టడంతో ఫీలయ్యానని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులు అన్న నీకు ఆడపిల్ల లేదన్న బాధ ఉంటే.. ఓ ఆడపిల్లను దత్తత తీసుకుని పెంచుకుంటే బాగుంటుంది కదా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది హాట్‌ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ తరం స్టార్ హీరోలు అయిన‌ మహేష్ బాబు, బన్నీ ఇద్దరికీ ఒక బాబు, ఒక పాప ఉన్నారు. అయితే ఎన్టీఆర్ కు ఇద్దరు బాబులే వారసులుగా రావడం విశేషం.

Tags: film news, filmy updates, intresting news, jr ntr, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood gossips, tollywood news, trendy news, viral news