బాబు కోసం ఏపీ జ‌నాలు ఈగ‌ర్ వెయిటింగ్‌… బెజ‌వాడ టు బంద‌రు రోడ్ షో స‌రికొత్త రికార్డ్‌..!

స్వచ్ఛందంగా జనం వచ్చే నాయకులకు, బలవంతంగా జనం రప్పించే నాయకులకు చాలా తేడా ఉందనే చెప్పాలి. స్వచ్ఛందంగా వచ్చే వారు..ఎంతసేపైన తమ నాయకుడు కోసం ఎదురుచూస్తారు. కానీ బలవంతంగా తీసుకొస్తే మాత్రం జనం నిలబడరు. అయితే ఈ రెండు ఉదాహరణలు ఒకరోజే కనిపించాయి. బుధవారం మార్కాపురం పర్యటనకు జగన్ వెళ్ళగా, మచిలీపట్నం పర్యటనకు చంద్రబాబు వెళ్లారు.

Andhra Pradesh: 7 dead, 8 injured after stampede at Chandrababu Naidu's  roadshow | Mint

అయితే ఇక్కడే కొన్ని తేడాలు ఉన్నాయి. జగన్ పర్యటనలో అధికార బలం కనిపించింది..బాబు పర్యటనలో ప్రజా బలం కనిపించింది. అసలు అధికారంలోకి వచ్చాక జగన్ ప్రజల్లో తిరగడం మానేశారు. రోడ్ షోలు చేయడం లేదు. జనం అందరినీ ఒక చోటు పోగేసి..సభలు పెడుతున్నారు. అది కూడా ఏదో పథకంకు బటన్ నోక్కే కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలని బలవంతంగా తరలిస్తున్నారు.

YSRC aims for a clean sweep again, TDP keen to regain glory- The New Indian  Express

ఇక సి‌ఎం కార్యక్రమానికి రాకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో జనం వస్తున్నారు. అటు వైసీపీ కార్యకర్తలు కూడా వస్తున్నారు. కానీ బలవంతంగా తరలించడంతో మధ్యలోనే జనం సభ నుంచి వెళ్లిపోతున్నారు. అది చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక దీనికి భిన్నంగా బాబు పర్యటనలు ఉన్నాయి..బాదుడేబాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలతో బాబు ప్రజల్లో తిరుగుతున్నారు. రోడ్ షోలతో ప్రజల్లో ఉంటున్నారు.

People regretting for electing Jagan, says TDP chief

ఆయనకు ప్రజా మద్ధతు విపరీతంగా కనిపిస్తుంది. అలాగే స్వచ్ఛందంగా వారు ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా మచిలీపట్నంలో ప్రోగ్రాం జరిగింది..వాస్తవానికి రోడ్ షో, సభ సాయంత్రం 6 గంటలకు..కానీ బాబు సభా ప్రాంగణంకు వచ్చేసరికి 11 అయింది..అంటే రోడ్ షోలో బాబుకు జనం ఏ విధంగా నీరాజనం పట్టారో అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగా విజయవాడ నుంచి బందరు రావడానికి 2 గంటల సమయం పడుతుంది.

7 dead in stampede at Chandrababu Naidu's roadshow in Andhra Pradesh |  Deccan Herald

కానీ బాబు రావడానికి 8 గంటలు పట్టింది..అంటే ఏ స్థాయిలో ప్రజలు రోడ్లపైకి వచ్చారో అర్ధం చేసుకోవచ్చు. నిజంగా ఇదో రికార్డ్‌. అడుగడుగున బాబు కోసం నిలబడ్డారు. అలాగే రాత్రి 11 గంటలైనా సభా ప్రాంగణంలో జనం ఉన్నారు. అంటే బాబు కోసం ప్రజలు నిలబడుతున్నారని అర్ధమవుతుంది..ఇంకా వారు జగన్‌ని పడగొట్టడమే మిగిలి ఉందని చెప్పవచ్చు.

Tags: AP, ap politics, chandrababu, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news