ఎన్టీఆర్ తాను ఇష్ట‌పడే హీరోయిన్ల ఇళ్ల‌కు ఏం పంపేవాడో తెలుసా..!

సీనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. 1950వ ద‌శ‌కంలో మొదలుపెడితే 1995లో ఆయన చనిపోయే ముందు వరకు ఎందరో హీరోయిన్లు ఎన్టీఆర్ తో రొమాన్స్ చేశారు. అలనాటి మేటినటీమణులు అంజలీదేవి, దేవిక, సావిత్రి నుంచి ఆ తర్వాత తరం హీరోయిన్లు జయసుధ, జయప్రద, వాణిశ్రీ, శ్రీదేవి ఇక 1985 తర్వాత వచ్చిన హీరోయిన్లలో రాధా, మీనాక్షి శేషాద్రి లాంటి హీరోయిన్లు కూడా ఎన్టీఆర్ కు జోడిగా నటించారు.

ఎన్టీఆర్ తో శ్రీదేవి..అప్పట్లోనే రికార్డ్ ! | Sridevi memorable movies with  NTR - Telugu Filmibeat

ఏ హీరోయిన్ విషయంలోనూ ఎన్టీఆర్ పై ఎలాంటి పుకార్లు షికార్లు రాలేదు. అయితే ఒక కృష్ణకుమారి విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఆమెను బాగా ఇష్టపడ్డారని.. ఆమెను ప్రేమించారని, తన భార్య బసవతారకం ను ఒప్పించి ఆమెను రెండో భార్య‌గా స్వీకరించేందుకు సిద్ధమయ్యారని వార్తలు వచ్చాయి. చెన్నైలో కృష్ణకుమారిని పెళ్లి చేసుకునేందుకు ఎన్టీఆర్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

KD No 1 Songs - Malli Malli Andhi - NTR Jayasudha - video Dailymotion

కృష్ణకుమారి కూడా పెళ్లికూతురుగా ముస్తాబు అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమ రావు ఆగ మేఘాల మీద చెన్నై వెళ్లి కృష్ణ కుమారిని బెదిరించడంతో ఆమె అప్పటికప్పుడు బెంగళూరు వెళ్ళిపోయారట. ఎన్టీఆర్ చాలామంది హీరోయిన్లతో సన్నిహితంగా ఉండేవారు. అదంతా స్నేహాపరంగా మాత్రమే. ఎన్టీఆర్ ఏనాడు ఏ హీరోయిన్ ను మరో దృష్టితో చూసేవారే కాదట.

NTR, Jayaprada Superhit Song | Yugapurushudu Movie Video Songs | Telugu  Movie Video Songs - YouTube

స్నేహపరంగా ఎన్టీఆర్‌కు నచ్చితే ఆ హీరోయిన్లను ఎంతో బాగా చూసుకునే వారట. తన ఇంట్లో స్వయంగా తయారు చేసిన జున్నుపాలు, ఆవకాయ పచ్చడి.. రకరకాల పచ్చళ్లతో పాటు మటన్, చికెన్ కూరలు తన భార్యతో స్వయంగా వండించి మరి ఆ హీరోయిన్ల ఇళ్లకు పంపేవారట. అంతే తప్ప అంతకుమించి ఎన్టీఆర్ హీరోయిన్ల విషయంలో ఏనాడు పరిధి దాటలేదు. ఒక కృష్ణకుమారి విషయంలో మాత్రం ఆయన కాస్త తొందరపడ్డాడు అని అంటారు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, ntr, seniour ntr, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news