నందమూరి నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ బ్లాక్బస్టర్ వీరసింహారెడ్డి. అఖండ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. సినిమాపై ముందు నుంచే మంచి హైప్తో పాటు భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్యకు జోడీగా శృతీహాసన్, హానీరోజ్ నటించారు. థమన్ మ్యూజిక్ ఇచ్చారు.
క్రాక్ లాంటి హిట్ సినిమా తర్వాత మలినేని గోపీచంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా తొలి రోజే ఏకంగా రు. 54 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి వరల్డ్ వైడ్గా బాలయ్య కెరీర్ పరంగానే హయ్యస్ట్ గ్రాస్ కొల్లగొట్టిన సినిమాగా రికార్డుల్లో నిలిచింది. ఓవరాల్గా కంప్లీట్ బాక్సాఫీస్ రన్లో వీరసింహా రు. 140 కోట్లు రాబట్టింది.
ఇక ఈ సినిమా 4 కేంద్రాల్లో 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గంతో పాటు కర్నూలు జిల్లా ఆలూరు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట, విజయవాడలో వీరసింహా సెంచరీ కొట్టేశాడు. ఈ క్రమంలోనే ఈ నెల 23న ఈ సినిమా 100 డేస్ సెలబ్రేషన్స్ వేడుక జరగనుంది. బాలయ్య సినిమాల సులువుగా 100 రోజులు ఆడే చిలకలూరిపేటలో ఈ సినిమా కూడా 100 ఆడడం విశేషం.
వీరసింహారెడ్డి 100 రోజుల కేంద్రాలు :
1- హిందూపురం – గరునాథ్
2- ఆలూరు – లక్ష్మీ నరసింహా
3- చిలకలూరిపేట – రామకృష్ణ
4- విజయవాడ – శకుంతల