బుల్లెట్ల వ‌ర్షం… ప్ర‌తి సెక‌న్ గూస్‌బంప్స్ మోతే.. ‘ ఏజెంట్ ‘ ట్రైల‌ర్ బ్లాస్టింగ్ ( వీడియో)

అక్కినేని నాగార్జునకు నట వారసుడుగా 2015 లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటివరకు మంచి క్రేజ్ సంపాదించుకోలేకపోయాడు. అయితే గత ఏడాది వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ సాధించిన అఖిల్ రేంజ్‌కు త‌గిన సక్సెస్ కాలేదని చెప్పాలి. ఇక ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఏజెంట్‌ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించనున్నాడు. అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుంది. సురేంద‌ర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పైనే అఖిల్ తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు రిలీజ్ అయ్యి సినిమా పై కోంత అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మళ్లీ మళ్లీ అనే పాట రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా కొద్ది క్షణాల క్రితం ఏజెంట్ సినిమా ట్రైల‌ర్‌ రిలీజ్ అయింది. ట్రైల‌ర్ ఆద్యంత అదిరిపోయింది. అఖిల్‌లో స‌రికొత్త యాక్ష‌న్ మ‌నం చూడ‌బోతున్నాం అన్న హింట్ ఇచ్చేసింది.

అఖిల్ ఓ స్పై ఏజెంట్‌గా వైల్డ్ యాక్ష‌న్‌లోకి దిగి బుల్లెట్ల మోస మోత మోగించేస్తుంటుంటే చూడ‌డానికి రెండు క‌ళ్లు చాల‌వు అన్న‌ట్టుగా ట్రైల‌ర్ ఉంది. ట్రైల‌ర్ అంతా కంటిన్యూగా యాక్ష‌న్‌.. యాక్ష‌న్‌… ఒక‌టి రెండు షాట్ల‌లో మాత్ర‌మే హీరోయిన్ సాక్షి వైద్య అందాలు చూపించింది. ఏదేమైనా ట్రైల‌ర్ అంతా గూస్ బంప్స మోత మోగిపోయింది. ట్రైల‌ర్‌తో కావాల్సినంత యాక్ష‌న్ చూపించిన అఖిల్ ఇక సినిమాలోనూ అద‌ర‌గొట్ట‌నున్నాడు. ఏజెంట్ ఈ నెల 28న రిలీజ్ అవుతోంది.

Tags: agent, agent movie trailer, Akhil, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news