ఆ రెండు చోట్ల వైసీపీపై ఇంత యాంటీ ఉన్నా టీడీపీ గెలిచే సీన్ లేదా…!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు..కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ స్థానాలు..ఈ స్థానాల్లో టి‌డి‌పికి పట్టు తక్కువ..ఒకప్పుడు ఈ స్థానాల్లో టి‌డి‌పి సత్తా చాటింది గాని..ఇప్పుడు సత్తా చాటలేని పరిస్తితి. గూడూరులో టి‌డి‌పి నాలుగుసార్లు గెలిచింది. 2009లో కూడా ఇక్కడ గెలిచింది. అయితే 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చింది. అయితే ఇప్పుడు అక్కడ గెలిచే అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని ఉపయోగించుకోవడంలో టి‌డి‌పి విఫలమవుతుంది.

Dr. Velagapalli Varaprasada Rao | MLA | Gudur | Nellore | Andhra Pradesh

అక్కడ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా వరప్రసాద రావు ఉన్నారు. అసలు ఆయనకు ఏ మాత్రం పాజిటివ్ లేదు. పూర్తి వ్యతిరేకత ఉంది. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం..అక్రమాలు, దందాలు ఎక్కువనే ఆరోపణలు ఉన్నాయి. అసలు సొంత పార్టీ వాళ్లే ఎమ్మెల్యేని వ్యతిరేకించే పరిస్తితి. మళ్ళీ ఆయన గాని వైసీపీ నుంచి నిలబడితే ఖచ్చితంగా ఓడిపోతారని సొంత పార్టీ వాళ్ళే చెబుతున్నారంటే అక్కడ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

కానీ అదే సమయంలో ఇక్కడ టి‌డి‌పి బలోపేతం కాకపోవడం గమనార్హం. వైసీపీపై వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో టి‌డి‌పి ఉంది. ఇక ఇదే పరిస్తితి రైల్వే కోడూరులో కూడా ఉంది. ఇక్కడ 2009 నుంచి కోరుముట్ల శ్రీనివాసులు గెలుస్తున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి, 2012, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు.

Koramutla Srinivasulu Comments - Sakshi

ఈయనపై కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది..ఇన్ని సార్లు గెలిచినా సరే కోడూరు ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. ఈ సారి ఆయనకు గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయి. అదే సమయంలో టి‌డి‌పి నేత నరసింహ ప్రసాద్ కష్టపడుతున్నారు గాని..ఇక్కడ టి‌డి‌పిలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. దీని వల్ల టి‌డి‌పి బలపడటం లేదు. అంటే గూడూరు, కోడూరులో వైసీపీపై వ్యతిరేకత ఉంది..కానీ టి‌డి‌పికి పాజిటివ్ లేదు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp, YS Jagan, ysrcp