టీడీపీని గెలిపించాల‌ని క‌సితో ర‌గులుతోన్న రెడ్లు… ఈ రెడ్డి నేత‌ల విక్ట‌రీ ఫిక్స్‌..!

రెడ్డి సామాజికవర్గం అంటే వైసీపీ అనే పరిస్తితి ఏపీలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ రెడ్డి వర్గం హవానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే వైసీపీ వచ్చాక అనేక మంది రెడ్డి నేతలకు పదవులు వచ్చాయి. ఇక వైసీపీ నుంచి దాదాపు 50 మంది వరకు రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచారంటే పరిస్తితి ఎలా ఉందో ? అర్ధం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో రెడ్డి వర్గం పూర్తి మద్ధతు వైసీపీకి దక్కింది. అయితే వైసీపీ వచ్చాక రెడ్డి నేతల హవా పెరిగిన మాట వాస్తవమే గాని..కానీ నాయకులకు మాత్రమే వారికి కావల్సిన పనులు జరిగాయి.

బుడ్డా రాజశేఖర్ రెడ్డి అస్త్రసన్యాసం, రాజకీయాల నుంచి నిష్క్రమణ | Budda  Rajasekhar Reddy Srisailam TDP MLA Candidate quits politics after getting  ticket– News18 Telugu

రెడ్డి సామాజికవర్గం ప్రజలకు సరైన న్యాయం జరగలేదు. దీంతో రెడ్డి వర్గం ప్రజలు కాస్త వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వైసీపీకి మద్ధతు ఇచ్చే అవకాశాలు లేవు. కొందరు టి‌డి‌పి వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. దీంతో ఈ సారి టి‌డి‌పి నుంచి కొందరు రెడ్డి గెలుపు దిశగా వెళుతున్నారని చెప్పవచ్చు.

ఇప్పటికే టి‌డి‌పిలోని రెడ్డి నేతలు దూకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే కసితో ఉన్నారు. దీంతో ఈ సారి కొందరు రెడ్డి తమ్ముళ్ళు గెలిచి గట్టెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవల సర్వేల్లో పలువురు రెడ్డి తమ్ముళ్ళు గెలుపు దిశగా వెళుతున్నారని తెలుస్తోంది.

Will son continue legacy of Bojjala?

అలా గెలుపు దిశగా వెళ్ళేవారిలో పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పలమనేరులో అమర్నాథ్ రెడ్డి, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి, బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి, మంత్రాలయంలో తిక్కారెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మ, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇలా కొందరు రెడ్డి నేతలు విజయం దిశగా వెళుతున్నారు. ఇంకా పలువురు రెడ్డి నేతలు ఇంకా పికప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్నికల నాటికి ఎంతమంది టి‌డి‌పి రెడ్డి నేతలు రేసులో ఉంటారో ? చూడాలి.

రేపటి నుంచి నామినేషన్లు వేస్తాం-మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి | TDP will make  nominations from tomorrow says Ex-Minister Amarnath Reddy

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp