ఈ యేడాది ఏప్రిల్ 20 టీడీపీకి ఇంత స్పెష‌లా… !

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ఈ నెల 20 చాలా ప్ర‌త్యేకం అంటున్నారు పార్టీ నాయ‌కులు. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా సంబ‌రాలు చేసుకునేందుకు రెడీ పార్టీ నాయ‌కులు రెడీ అవుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైనాట్ పులివెందుల నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్తున్న టీడీపీలో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త జోష్ నింపుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అనేక కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖ‌ర్మ‌.. వంటి కార్య‌క్ర మాల‌తో దూసుకుపోతున్నారు.

అయితే, కొంద‌రు నాయ‌కులు పాల్గొంటున్నారు. మ‌రికొంద‌రు దూరంగా ఉంటున్నారు. అయినా కూడా చంద్ర‌బాబు ఎక్క‌డా టెంపో త‌గ్గ‌కుండా దూసుకుపోతున్నారు. తానేస్వ‌యంగా దిగి కార్య‌క్ర‌మాలు నిర్వ హిస్తున్నారు. జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు కూడా రెడీ అవుతూనే ఉన్నారు. ప్ర‌స్తుతం కూడా ఆయ‌న జోన్‌ల వారీగా జిల్లాల్లో ప‌ర్య‌టించి.. నాయ‌కుల‌ను మేల్కొలుపుతున్నారు. దిశానిర్దేశం చేస్తున్నారు. వారిని రంగంలోకి దిగేలా ప్రోత్స‌హిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఈనెల 20న రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో మ‌రింత జోష్ పెంచేలా కార్య‌క్ర‌మాల‌కు రెడీ అయ్యారు. దీనికి కార‌ణం ఈ నెల 20న చంద్ర‌బాబు 73వ పుట్టిన రోజు. 1950, ఏప్రిల్ 20న జ‌న్మించిన ఆయ‌న‌కు ఈ పుట్టిన రోజు చాలా ప్ర‌త్య‌కం ప్ర‌త్యేకం. గ‌త మూడేళ్ల‌లో పార్టీ పుంజుకుంటుందా.. లేదా? అనే సందేహాలు.. స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పుంజుకోవ‌డంతో పార్టీపై న‌మ్మ‌కం పెరిగింది.

దీనికితోడు ఓట‌మితో చంద్ర‌బాబు కుంగిపోకుండా ముందుకు సాగుతున్నారు. ఇక‌, మ‌రోవైపు యువ‌గ‌ళం పేరుతో నారా లోకేష్ కూడా ముందుకు సాగుతున్నారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలో చంద్ర‌బాబు కూడా ఒకింత ఆనందంగానే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో పుట్టిన రోజు వేడుక‌ల‌ను మండ‌ల‌స్థాయి నుంచి నియోజ‌క‌వ‌ర్గాలు, జిల్లాల స్థాయి, రాష్ట్ర స్థాయి వ‌ర‌కు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో ఈ నెల 20న టీడీపీలో మ‌రింత జోష్ పెర‌గ‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, trendy news, viral news