చంద్ర‌బాబు VS లోకేష్ మ‌ధ్య‌లో రామ్మోహ‌న్‌నాయుడు… ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్టులు..!

రామ్మోహన్ నాయుడు ఈ పేరు వింటేనే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా గూస్ బంప్స్‌ మొదలవుతాయి. తెలుగుదేశం పార్టీ యువతరం రక్తం ఉరకలు వేస్తుంది. అసలు రామ్మోహన్ నాయుడు స్పీచ్ లు వింటే దద్దరిల్లి పోవాల్సిందే.. ఒక్కసారిగా పూనకాలు వస్తాయి. తన తండ్రి దివంగత కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రంన్నాయుడు, తన బాబాయ్ మాజీ మంత్రి అచ్చెంన్నాయుడు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాలలోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు టిడిపి నుంచి వరుసగా రెండుసార్లు శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించారు.

Come and see people's response to TDP meets: Chandrababu to Jagan- The New Indian Express

తెలుగుదేశం పార్టీ గళాన్ని ఢిల్లీలో జాతీయస్థాయిలో వినిపించడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ యువ ఎంపీకి జాతీయ స్థాయిలో ఎంతో క్రేజ్ ఉంది. పైగా ఉత్తరంధ్ర‌లో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన యువనేత కావడంతో.. భవిష్యత్తు రాజకీయాల్లోనూ రామ్మోహన్ నాయుడు కీలకంగా ఉండ‌నున్నారు. తెలుగుదేశం పార్టీలో రామ్మోహన్ నాయుడు హ‌వా, శ‌కం ప్రారంభమైందనే చెప్పాలి. పార్టీలో ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రజల్లో పార్టీలకు అతీతంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ లీడర్ విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఆలోచనలు వేరువేరుగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

Rammohan Naidu building his own PR team!

లోకేష్ అయితే రామ్మోహన్ నాయుడును అసెంబ్లీకి పోటీ చేయించి క్యాబినెట్ లోకి తీసుకొని.. భవిష్యత్తులో తన టీంలో కీలక బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే చంద్ర‌బాబు మాత్రం రామ్మోహ‌న్ నాయుడును లోక్‌స‌భ‌కే పంపాల‌ని.. అప్ప‌ట్లో ఎర్రంన్నాయుడు ఎలా అయితే టీడీపీ ఎంపీగా బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తూ జాతీయ రాజ‌కీయాల్లో కీ రోల్ ప్లే చేశారో… ఇప్పుడు రామ్మోహ‌న్ నాయుడు కూడా లోక్‌స‌భ‌లో ఉంటేనే పార్టీ వాణి జాతీయ స్థాయిలో గ‌ట్టిగా ఉంటుంద‌ని భావిస్తున్నార‌ట‌.

AP: Police grab mike from TDP activist at Nara Lokesh's meeting

ఎవ‌రికి అయినా అసెంబ్లీకి పోటీ చేయాల‌న్న కోరిక ఉంటుంది. స‌హ‌జంగానే మంత్రి ప‌ద‌విపై ఆశ ఉంటుంది. ఇక లోకేష్ ఎలాగూ రామ్మోహ‌న్ నాయుడిని త‌న టీంలో కీల‌కంగా చేసుకోవాల‌ని అనుకుంటున్నారు. రామ్మోహ‌న్ అసెంబ్లీ ఆశ‌లు ఎలా ఉన్నా చంద్ర‌బాబు మాత్రం రామ్మోహ‌న్ నాయుడుకు ఇక నుంచి ఢిల్లీలో మ‌రిన్ని కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నారు. అందుకే ఆయ‌న్ను అసెంబ్లీ బ‌రిలో దించేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. మ‌రి రామ్మోహ‌న్ విష‌యంలో ఈ తండ్రి కొడుకుల్లో ఎవ‌రు రాజీప‌డ‌తారో ? చూడాలి.

Tags: ap politics, chandrababu, intresting news, jagan, latest news, latest viral news, lokesh, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp, ysrcp