క‌డ‌ప జిల్లాలో టీడీపీ గెలిచే ఫ‌స్ట్ సీటు అదే… ఆయ‌న స‌పోర్ట్‌తో ఒక్క‌సారిగా మారిన సీన్‌..!

ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారుతున్నాయి. గత 20 సంవత్సరాల ప్రతి ఎన్నికల్లోను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక్క అసెంబ్లీ సీటుతోనే సరిపెట్టుకుంటూ వస్తోంది. గత ఎన్నికలలో అయితే జిల్లాలో టిడిపి ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే ఇప్పుడున్న సమీకరణలను బట్టి చూస్తే జిల్లాలో వచ్చే ఎన్నికలలో టిడిపి ఐదారు సీట్లలో వైసీపీకి గట్టిపోటి ఇవ్వనుంది. సమీకరణలు చాలా వేగంగా మారుతున్నాయి. వైసీపీ అంచనాలు తలకిందులు అవుతున్నాయి.

ఈ క్రమంలోనే జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే తొలి సీటు ప్రొద్దుటూరు అవుతుందన్న అంచనాలు బలంగా వస్తున్నాయి. ఇక్కడ నుంచి టిడిపి యువ నేత ఉక్కు ప్రవీణ్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. 2014 ఎన్నికలలో టిడిపి నుంచి పోటీ చేసిన సీనియర్ నేత వరదరాజుల రెడ్డి, 2019లో పోటీ చేసిన మరో సీనియర్ నేత లింగారెడ్డి,, ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

Tension In Former MLA Nandyala Varada Rajulu Reddy Hometown - Sakshi

వచ్చే ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాల‌న్న బాబు ఆలోచ‌న‌తో కేవలం కడప జిల్లాలో మాత్రమే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా యువతలో క్రేజ్ ఉన్న ఉక్కు ప్రవీణ్ రెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ కోసం ప్రవీణ్ రెడ్డి చేసిన పోరాటంతో ఆయన ఉక్కు ప్రవీణ్ రెడ్డి గా పేరు తెచ్చుకున్నారు. కేవలం ప్రొద్దుటూరు నియోజకవర్గం, కడప జిల్లాలో మాత్రమే కాకుండా.. రాయలసీమ వ్యాప్తంగా యువతలో మంచి పేరు తెచ్చుకున్నారు.

Mallela Linga Reddy | ElectWise

 

ఇక నియోజకవర్గ పార్టీ పగ్గాలు అప్పగించినప్పటి నుంచి పార్టీ పరంగా కార్యకర్తలతో మమేకమవుతూ ప్రవీణ్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఆయన ఇన్చార్జిగా వచ్చాక ప్రొద్దుటూరులో తెలుగుదేశం రోజు రోజుకు భారీగా గ్రాఫ్ పెంచుకున్న మాట వాస్తవం. ప్రవీణ్ రెడ్డి ఎంత కష్టపడుతున్నా సీనియర్ నేతలు లింగారెడ్డి , వరదరాజుల రెడ్డి సహకారం ఎలా ఉంటుందన్న ? సందేహాలు ఉండనే ఉన్నాయి. అయితే తాజాగా వరదరాజులు రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. తాను కూడా సీటు రేసులో ఉన్నానని చెబుతూనే టికెట్ ఎవరికీ ఇచ్చిన తాను కష్టపడి కష్టపడతానని.. తన సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయని చెప్పారు.

ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ప్రవీణ్ తో కలిసి పని చేస్తానని.. చాలాకాలంగా ప్రవీణ్ కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ప్రవీణ్ తాము పరస్పరం సహకరించుకుని టిడిపిని గెలిపించుకుంటామని వరదరాజులు రెడ్డి తెలిపారు. ప్రవీణ్ కు టికెట్ ఇచ్చినా మద్దతుగా పనిచేస్తానని.. ప్రవీణ్‌కు ప‌ని పనిచేయటానికి తాను ఎంత మాత్రం వెనకాడనని చెప్పారు. ఏది ఏమైనా నియోజకవర్గంలో పూర్వ శాంతియుత పరిస్థితులను నెలకొల్పుతామన్నారు. నియోజకవర్గంలో తన వర్గాన్ని కలిసి టిడిపిని బలోపేతం చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. వరదరాజు రెడ్డి చేసిన ప్రకటనతో నిజంగా ప్రొద్దుటూరు టిడిపికి మరింత ఉత్సాహం వచ్చినట్లు అయింది. ఇప్పటికే దూసుకుపోతున్న ప్రవీణ్ లాంటి నేతలకు వరదరాజుల రెడ్డితో పాటు లింగారెడ్డి లాంటి నేతలు కూడా కలిసి పనిచేస్తే ప్రొద్దుటూరులో టిడిపి అంచనాలకు మించి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp, ysrcp