ఆ స్టార్ హీరోకి భార్య కావాల్సిన లక్ష్మి మంచు .. ఇలా అయిపోవడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ గా పేరు సంపాదించుకున్న మోహన్ బాబుకు ముగ్గురు సంతానం అన్న విషయం అందరికీ తెలిసిందే. మొదట లక్ష్మీ మంచు .. ఆ తర్వాతవిష్ణు.. ఆ తర్వాత మనోజ్ ..ముగ్గురు సినిమా ఇండస్ట్రీలో తమదైన స్టైల్ లో దూసుకుపోతున్నారు . అయితే మంచు వారసురాలుగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముగ్గురిలో అబ్బాయిల కన్నా సరే అమ్మాయి అయినా మంచు లక్ష్మి పాపులారిటీ బాగా సంపాదించుకుంది. రీసెంట్ గానే మాన్ స్టర్ సినిమాలో లెస్బియన్ రోల్ చేసి తనదైన స్టైల్ లో ఆకట్టుకుంది.

మొదటి నుంచి మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్ అన్న విషయం అందరికీ తెలిసిందే . హోస్టుగా ..డైరెక్టర్గా.. ప్రొడ్యూసర్ గా తనదైన స్టైల్ లో తన టాలెంట్ ని జనాలకి చూపిస్తూ క్రేజ్ సంపాదించుకుంది మంచు లక్ష్మీ. నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే సీనియర్ హీరో తమ్ముడికి భార్యగా అవ్వాల్సి ఉండిందట . హీరో తమ్ముడికి ఇచ్చి మంచు లక్ష్మిని పెళ్లి చేయాలని మంచు మోహన్ బాబు ఎప్పటినుంచో అనుకున్నారట . అంతేకాదు ఆ స్టార్ హీరో తమ్ముడికి కూడా మంచు లక్ష్మి అంటే అదొక ప్రత్యేకమైన అభిమానం ఉండేదట.

Lakshmi Manchu Height, Weight, Age, Husband, Family, Biography & More »  StarsUnfolded

మరీ ముఖ్యంగా మొదటి నుంచి ఫారిన్ కంట్రీస్ లో సెటిల్ అవ్వాలి .. అటువైపుగా వెళ్లాలి అనుకున్న ఈ స్టార్ హీరో తమ్ముడికి మంచు లక్ష్మి పర్ఫెక్ట్ మ్యాచ్ అని..అంతా అనుకున్నారట . అయితే పెళ్లి సంబంధం మాట్లాడుకునే టైంలోనే లక్ష్మి మంచు తన మనసులో ఉన్న అబ్బాయి గురించి బయట పెట్టడంతో మోహన్ బాబు ఈ సంబంధాన్ని ఇక్కడే క్యాన్సిల్ చేసేసారట. లక్ష్మి మంచుకి నచ్చని విషయం ఏ మాత్రం ఇంట్లో జరగడానికి వీలు లేదంటూ మోహన్ బాబు కూతురు అంగీకారంతోనే ఆమె ఇష్టపడిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారట.

Where does Mohan Babu family get money to make films? - Quora

ఆ తర్వాత లక్ష్మి మంచు లైఫ్ లో జరిగిన విషయాలన్నీ మనకు తెలిసిందే. ఆమెకు పాప ఎలా పుట్టిందో కూడా మనకి బాగా తెలిసిన విషయమే . ప్రజెంట్ ఇండస్ట్రీలో లక్ష్మి ఉంచు తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో మంచు వారు అబ్బాయిలు మనోజ్ – విష్ణు వార్ ఎలా కొనసాగుతుందో బాగా తెలిసిన విషయమే . ఈ క్రమంలోనే మంచు లక్ష్మి కి సంబంధించిన పాత న్యూస్ ఇలా వైరల్ అవుతూ ఉండడం మంచు ఫాన్స్ కి కూడా పడడం లేదు . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్ బాబు పేరుని ఇలా కొడుకులు రోడ్డున పడేస్తున్నారు అంటూ ఆయన ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!!

Tags: acttress, film news, filmy updates, intresting news, latest news, latest viral news, manchu lakshmi, social media, social media post, star doughter, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news