మ‌నోజ్ దంప‌తుల‌కు రామ్‌చ‌ర‌ణ్ – ఉపాస‌న స‌ర్‌ఫ్రైజ్ గిఫ్ట్‌.. (ఫోటో)

టాలీవుడ్ యంగ్ హీరో మంచు వారసుడు మనోజ్ ఇటీవల రెండో పెళ్లితో కొత్త జీవితం ఆరంభించిన సంగతి తెలిసిందే. మనోజ్.. భూమా మౌనికను గత నెల మూడో తేదీన పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు దంపతులు కలిసి ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించారు. మనోజ్‌తో పాటు అటు మౌనికకు కూడా గతంలోనే వేరువేరు వ్యక్తులతో పెళ్లిళ్లు అయ్యాయి. అయితే మనస్పర్ధలు నేపథ్యంలో వారు తమ భాగస్వాములకు విడాకులు ఇచ్చేసి ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు.

Manchu Manoj to wed Mounika Reddy tonight | 123telugu.com

ఇక మనోజ్.. మౌనికను తన భార్య‌గా స్వీకరించడంతో పాటు ఆమె కొడుకు ధైర‌వ్‌రెడ్డి బాధ్యత కూడా తనదేనని సగర్వంగా వెల్లడించారు. ఇక మంచు లక్ష్మి తన తమ్ముడు పెళ్లిని భుజాన వేసుకొని తన ఇంట్లోనే అంగరంగ వైభవంగా జరిపించారు. పెళ్లి తర్వాత నూతన దంపతులు తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. మనోజ్ పెళ్లి తర్వాత మంచు ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఏది ఏమైనా మనోజ్, మౌనిక రెడ్డి ఇప్పుడు సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ దంపతులకు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ఓ స‌ర్‌ఫ్రైజ్ గిఫ్ట్‌ పంపారు. ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా ట్విట్ చేశాడు. పాలరాతితో చేసిన జంట స్వేచ్ఛగా విహరిస్తున్నట్టుగా ఉన్న ఓ బహుమతిని పంపి.. వారి ఆశీర్వాదం కూడా అందించారంటూ సదరు ఫోటోలను మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Ram Charan finally opens about Upasana's tweet on Modi | Telugu Bulletin

స‌ర్‌ఫ్రైజ్ గిఫ్ట్‌లు అనేవి ఇలా అద్భుతంగా ఉంటాయి. థాంక్యూ చరణ్, ఉపాసన మిమ్మల్ని ఎప్పుడు ఎప్పుడు కలుద్దామా అని ఎదురుచూస్తున్నాను… మాల్దీవుల ట్రిప్ అవ్వ‌గానే కలుద్దాం ప్రేమతో అని రాసుకోవచ్చాడు. దీంతో ఇప్పుడు మెగా అభిమానులు, రాంచరణ్ అభిమానులు కూడా మనోజ్ ఇచ్చిన రిప్లైకు మీ సరికొత్త వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Tags: filmy updates, intresting news, latest news, latest viral news, ram charan, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, upasana, viral news