క‌మ్మ + ఎస్సీ ఈక్వేష‌న్‌తో కొడాలి కూసాలు క‌దిలిపోతున్నాయ్‌… కెరీర్‌లో ఫ‌స్ట్ టైం గింగ‌రాలు…!

ఏపీలో వచ్చే ఎన్నికలలో అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాలలో కృష్ణాజిల్లాలోని గుడివాడ ఒకటి. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని టిడిపి శ్రేణులు టార్గెట్గా పెట్టుకున్నాయి. తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన నాని 2004, 2009 ఎన్నికలలో ఆ పార్టీ నుంచి గెలిచారు. వైసీపీలోకి వెళ్లిన నాని 2014, 2019 ఎన్నికలలోను ఓటమి లేకుండా విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికలలో టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయారు.

Kodali Nani : ఐసీయూలో మాజీ మంత్రి కొడాలి నానీ.. | Andhra Pradehs Ex  minister kodali nani in Hyderabad Apollo Hospital nk– News18 Telugu

వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయిన నాని చంద్రబాబు, లోకేష్, టిడిపిపై ఎలాంటి దారుణమైన పదజాలం ఉపయోగించారో అందరూ చూస్తూనే ఉన్నారు. కొడాలి నాని వాడుతున్న పదజాలం పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి మనసులను ఎంతో బాధ పెడుతుంది. ఈ క్రమంలోనే కేవలం చంద్రబాబు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, నందమూరి అభిమానులు కూడా ఈసారి గుడివాడలో కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని కసితో రగులుతున్నారు.

పార్టీ గెలిచి చంద్రబాబు అధికారంలోకి రావడం కాదు. గుడివాడలో నానిని ఓడించాలన్నదే వారి కసి. అయితే ఇక్కడ టిడిపికి బలమైన అభ్యర్థి దొరకటం లేదు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన మంచి వ్యక్తి అయినా.. నానిని అంగ, ఆర్థిక బలాల్లో ఢీకొట్టే సత్తా లేదు. అలాగే సరైన రాజకీయ వ్యూహాలు కూడా లేకుండా పోయాయి. అందుకే గుడివాడలో దశాబ్దాలుగా రావి రాజకీయాలలో ఉన్నా నానిని ఢీకొట్టే బలమైన అభ్యర్థిగా మారటం లేదు.

కొడాలిపై టీడీపీ అభ్యర్ధి ఫైనల్ ? చంద్రబాబు ఛాయిస్ ఇదే ! మాజీ మంత్రి సవాళ్లు  అందుకేనా ! | chandrababu plans to field nri venigandla ramu against kodali  nani in gudivada in 2024 ...

ఈ క్రమంలోనే ఎన్నారై వెనిగండ్ల రాము గుడివాడలో దూసుకుపోతున్నారు. క‌మ్మ‌ సామాజిక వర్గానికి చెందిన రాము ఆర్థికంగా బలంగా ఉన్నారు. దీనికి తోడు రాము భార్య ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినవారు. ఈ ఈక్వేషన్ లో రాము దూసుకుపోతున్నారు. గ‌త ఆరేడు నెల‌లుగా రాము భార్య కూడా ఎస్సీ పేట‌ల్లో ప‌ర్య‌టిస్తూ, ఇటు చ‌ర్చిల్లో ప్రార్థ‌నాల ద్వారా దూసుకుపోతూ కొన్ని వ‌ర్గాల్లో బాగా ప‌ట్టు పెంచుకుంటున్నారు.

ఇక చంద్రబాబు కూడా వెనిగండ్ల రాము అభ్యర్థిత్వానికి సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్త కొడాలి నాని కి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దీనికి తోడు ఈ సారి గుడివాడ‌లో కాపు వ‌ర్గంలో కూడా మార్పు క‌నిపిస్తోంది. ఇక జ‌న‌సేన + టీడీపీ పొత్తు ఉంటే కొడాలి తొలిసారిగా 2024లో ఓడిపోయేందుకు రెడీ అవ్వాల్సిందే అన్న చ‌ర్చ‌లు కూడా అక్క‌డ స్టార్ట్ అయ్యాయి. ఈ భ‌యంతోనే నాని ఈ సారి ఎన్నిక‌లు ఎలా ? ఎదుర్కోవాలా ? అని త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.

Exit polls say Chandrababu Naidu could win state battle but lose out on  national ambitions

Tags: AP, ap minister kodali nani, ap politics, Boycott, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp