శ్రావణికి లోకేష్ ఇంత ప్ల‌స్ అయ్యాడా…. ప‌ద్మావ‌తికి మామూలు షాక్ కాదుగా…!

నారా లోకేష్ పాదయాత్ర వల్ల తెలుగుదేశం పార్టీకి ఏమైనా లాభం ఉందా? అంటే పాదయాత్ర మొదట్లో ఎవరు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఏదో పాదయాత్ర జరుగుతుందిలే అనే పరిస్తితి. రాష్ట్ర స్థాయిలో అది హైలైట్ కాలేదు. కానీ నిదానంగా పాదయాత్ర సక్సెస్ అవుతూ వస్తుంది. ప్రజల్లోకి లోకేష్ వెళ్ళే విధానం నచ్చుతుంది. ఆయన అన్నీ వర్గాల ప్రజలని కలుసుకుంటూ వెళుతున్నారు. ఎక్కడకక్కడ ప్రతి వర్గంతో సెపరేట్ గా మాట్లాడుతూ..వారి సమస్యలని తెలుసుకుంటున్నారు.

TDP Leader Nara Lokesh Says Amaravati Will Remain 'People's Capital' Of  Andhra Pradesh | India News | Zee News

ముఖ్యంగా యువతని ఎక్కువ ఆకర్షించేలా ముందుకెళుతున్నారు. దీంతో నిదానంగా లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరిగింది. అలాగే ఆయన ఎక్కడ పాదయాత్ర చేస్తే అక్కడ టి‌డి‌పికి ప్లస్ అవుతుంది. అయితే అదృష్టం కొద్ది శింగనమల నియోజకవర్గంలో గత మూడు రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నారు. మామూలుగా ఒక్కో స్థానంలో ఒక్క రోజులోనే పాదయాత్ర ముగుస్తుంది. కానీ శింగనమలలో లాంగ్ టైమ్ నడుస్తోంది. ఇది ఓ రకంగా టి‌డి‌పి ఇంచార్జ్ బండారు శ్రావణికి అడ్వాంటేజ్ అనే చెప్పాలి.

అక్కడ ఎక్కువ రోజులు పాదయాత్ర వల్ల టి‌డి‌పికి కొత్త ఊపు వస్తుంది. వాస్తవానికి ఇక్కడ మొన్నటివరకు వైసీపీ ఆధిక్యం ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పద్మావతి భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఆ మెజారిటీ నిదానంగా తగ్గుతూ వచ్చింది. ఇదే సమయంలో లోకేష్ పాదయాత్రతో మరింత అడ్వాంటేజ్ పెరిగింది. అటు నియోజకవర్గంలోని అక్రమాలపై లోకేష్ క్లియర్ గా ప్రజలకు వివరించి చెబుతున్నారు.

ఒక్క ఎన్నికతోనే పక్కన పెట్టేశారే? | in the last election, bandaru sravani  contested from singanamala constituency and lost.

దీంతో ఎమ్మెల్యే పద్మావతిపై ప్రజల ఆలోచన మారుతుంది. ప్రజలకు మేలు చేయడం కంటే..నష్టం ఎక్కువ చేస్తున్నారని తెలుస్తుంది. ఇదే అంశం శ్రావణికి ప్లస్ అవుతుంది. ఇదే ఊపుని శ్రావణి కొనసాగించి..పార్టీని ఇంకా బలోపేతం చేస్తే ఈ సారి శింగనమలలో గెలవడం ఖాయం.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp