ఇంట్రెస్టింగ్ : హీరోయిన్ అనుష్క పిచ్చి పిచ్చిగా ప్రేమించిన స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా..!

2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగర్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయింది అనుష్క. ఈ బెంగళూరు బ్యూటీ అనుష్క యోగా టీచర్‌గా కెరీర్ ప్రారంభించింది. నాగచైతన్యకు ఆమె యోగ నేర్పిన‌ టీచర్.. ఈ సమయంలో ఆమెను చూసిన పూరి సూపర్ సినిమా ఆడిషన్స్‌కు పిలిచారు. అలా సూపర్ సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయం అయింది.

Anushka Shetty - IMDb

అక్కడ నుంచి అనుష్క వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది 15 సంవత్సరాలకు పైగా తెలుగుతోపాటు అటు తమిళ ఇండస్ట్రీ ఇటు కన్నడలోనూ స్టార్ హీరోలతో జోడి కట్టి ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టింది. ప్రస్తుతం అనుష్క వయసు 40 సంవత్సరాలు దాటితోంది. ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోకుండా ఇంకా సినిమాలు నటన అంటూ కాలం గడుపుతోంది. ఇటీవల కాలంలో ఆమెకు ఆఫర్లు కూడా బాగా తగ్గిపోయాయి తాజాగా ఈ అమ్మడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కి జోడిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తోంది.

పి మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది.. ఇక అనుష్క పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చిన అవన్నీ పుకర్లుగా మిగిలిపోయాయి. ఇంట్లో వాళ్ళు మాత్రం ఆమెకు త్వరగా పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇక అనుష్కకు కొందరు స్టార్‌ హీరోలకు మధ్య ప్రేమ ఎపైర్‌లు నడిచాయన్న గుసగుసలు ఉండనే ఉన్నాయి. ఈ హీరోల సంగతి పక్కన పెడితే అనుష్క ఒక స్టార్ క్రికెటర్ ను పిచ్చిపిచ్చిగా ప్రేమించిందట.

BCCI invite applications for NCA Head of Cricket job, Rahul Dravid likely to reapply: Report

ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అనుష్క మనసు దోచుకున్న ఆ క్రికెటర్ ఎవరో కాదు.. కర్ణాటక మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్.. అనుష్క అభిమాన క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ చిన్నతనం నుంచి రాహుల్ అంటే తనకు పిచ్చి అని ఒకానొక టైం లో రాహుల్‌తో పీకల్లోతో ప్రేమలో పడిపోయాని అనుష్క చెప్పింది. ఇక అనుష్క ప్రస్తుతం నటిస్తున్న సినిమా సక్సెస్ అయితే ఆ తర్వాత ఆమె మరి కొంతకాలం ఇండస్ట్రీలో కొనసాగాలన్న ఆశలతో ఉంది..!!