“పరేషాన్” రివ్యూ :సినిమా చూసి ఆడియెన్స్ పరేషాన్ అవ్వరు..!!

సినిమా: పరేషాన్
నటీనటులు: తిరువీర్, పావని కరణం, బన్నీ అబిరాన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ తదితరులు
దర్శకత్వం: రూపక్ రొనాల్డ్‌సన్
నిర్మాత: సిద్ధార్థ్ రాళ్ళపల్లి
మ్యూజిక్: యశ్వంత్ నాగ్
రిలీజ్ డేట్: 02-06-2023

Pareshan Movie Review : Pareshan Movie Review..! | Latest News in Telugu | Telugu News

ప్రస్తుతం కొత్త ట్యాలెంట్‌తో టాలీవుడ్ సరికొత్త సినిమాలతో కళకళలాడుతోంది. ఇటీవల వస్తున్న సినిమాలన్నీ కూడా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో వస్తుండటం.. వాటిని జనం కూడా బాగా ఆదరిస్తుండటంతో, మేకర్స్ ఈ నేపథ్యంలో సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇదే కోవలో తాజాగా తిరువీర్ హీరోగా నటించిన ‘పరేషాన్’ మూవీ కూడా వచ్చింది. నేడు రిలీజ్ అయిన ఈ పరేషాన్ మూవీ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూల చూద్దాం.

కథ:
ఐసాక్(తిరువీర్) తన స్నేహితులతో కలిసి అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు. ఎలాంటి భాద్యతలు లేని కుర్రాడిగా ఐసాక్ జీవిస్తుంటాడు. అయితే, స్నేహితుడికి అవసరం ఉందని ఐసాక్ తన తండ్రి సొమ్మును అతడికి ఇస్తాడు. కాగా, శిరీష(పావని కరణం)తో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు ఐసాక్. ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అయిందని తెలుసుకున్న ఐసాక్ ఆ తరువాత ఏం చేశాడు.. తన స్నేహితులు ఐసాక్ కోసం ఏం చేశారు.. అనేది సినిమా కథ.

Pareshan - Telugu Movie Review, Ott, Release Date, Trailer, Budget, Box Office & News - FilmiBeat

విశ్లేషణ:
తెలంగాణ నేపథ్యంలో వస్తున్న సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతుండటంతో, మరోసారి అలాంటి బ్యాక్‌డ్రాప్‌తో ‘పరేషాన్’ మూవీని మేకర్స్ రూపొందించారు. చిన్న పాయింట్‌తో సినిమాను ఎంగేజింగ్‌గా మలచడంలో దర్శకుడు రూపక్ రొనాల్డ్‌సన్ సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమా కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్ మొత్తం కామెడీతో నింపేశారు. హీరో తిరువీర్ తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన స్నేహితులతో ఆవారాగా తిరుగుతూ, లవర్‌తో రొమాన్స్ చేస్తూ కనిపిస్తాడు. ఇక ఒక మంచి బ్లాక్‌తో ఇంటర్వెల్ రావడంతో, సెకండాఫ్‌పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంటుంది.

అటు సెకండాఫ్‌లో సినిమా కథను సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్లారు. హీరో తండ్రిగా మురళీధర్ గౌడ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎమోషన్స్‌తో సెకండాఫ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ బ్లాక్‌లు ముందే ఊహించే విధంగా ఉండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి తగ్గుతుంది.

Pareshan Movie Official Trailer || Rana Daggubati || Thiruveer || Pavani || Rupak Ronaldson || NSE - YouTube

ఓవరాల్‌గా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘పరేషాన్’ మూవీ ఒక యావరేజ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిందని చెప్పాలి. ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన కంటెంట్‌ను కామెడీ జోడించి మనముందుకు తీసుకొచ్చిన చిత్ర యూనిట్, అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేదని చెప్పాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
టక్ జగదీష్, మసూద చిత్రాలతో తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తిరువీర్.. మరోసారి తన యాక్టింగ్‌తో ఇంప్రెస్ చేశాడు. తెలంగాణ యాసలో మంచి మార్కులు కొట్టేశాడు. అతడి స్నేహితులుగా నటించిన వారు తమ పాత్రల్లో జీవించారు. హీరోయిన్ పాత్రకు పెద్దగా గుర్తింపు లేకపోయినా, పావని కరణం తన నటనతో పర్వాలేదనిపించింది. హీరో తండ్రిగా మురళీధర్ గౌడ్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాడు.

Pareshan (2023) - Movie | Reviews, Cast & Release Date in shadnagar- BookMyShow

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడ రూపక్ రొనాల్డ్‌సన్ పూర్తిగా కామెడీని నమ్ముకుని, ఈ సినిమాను తెరకెక్కించిన తీరు బాగున్నా, సినిమాలో కథ చాలా వీక్‌గా ఉండటం మైనస్ అని చెప్పాలి. రూపక్ ఈ సినిమాలో పెద్దగా ఎలాంటి మెసేజ్‌లు ఇవ్వకుండా సింపుల్‌గా కానిచ్చేశాడు. యాక్టర్స్ నుండి తనకు ఏం కావాలో, అది రాబట్టుకోవడంలో రూపక్ సెక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ఈ సినిమాకు పాజిటివ్‌గా నిలిచింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
పరేషాన్ – సినిమా చూసి ఆడియెన్స్ పరేషాన్ అవ్వరు!

రేటింగ్:
2.25/5.0