కొడాలితో వైసీపీకి ఇంత డ్యామేజ్ జ‌రుగుతోందా…!

గత కొన్ని రోజులుగా నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటు చేశారని ఆరోపిస్తూ…ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలని వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే వారు చంద్రబాబుకు అమ్ముడుపోయారని వైసీపీ నేతలు వరుసపెట్టి ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Vijayawada: Kodali Nani hails YSRCP victory

ఇక వరుసపెట్టి కొందరు ఎమ్మెల్యేలు బయటకొచ్చి టి‌డి‌పి తమకు కూడా ఆఫర్ ఇచ్చిందని..రూ.10 కోట్లు ఇస్తాం..టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ చేయాలని కోరారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై వైసీపీ నుంచి పలువురు నేతలు చంద్రబాబు టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ఇక ఎప్పుడప్పుడా అని ఎదురుచూస్తున్న కొడాలి నాని కూడా ఎంట్రీ ఇచ్చి..బాబుపై యథావిధిగా విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా ఎప్పటిలాగానే ఎన్టీఆర్‌కు ఎన్టీఆర్ పోటు, టి‌డి‌పిని లాక్కున్నారని, జగన్ నిజాయితీ గల నాయకుడు అంటూ మాట్లాడారు.

జగన్ విసిరిన ఎంగిలి మెతుకులతో బాబు గెలిచాడని, ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ప్రజామోదం లేదని కొడాలి చెప్పుకొచ్చారు. ఇప్పుడు నలుగురుని తీసుకుంటే..ఆ నాలుగు సీట్లే వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పికి వస్తాయని జోస్యం చెప్పారు. అయితే వైసీపీ నేతలు విమర్శించినట్లుగా, కొడాలి అన్నట్లుగా టి‌డి‌పికి నాలుగే సీట్లు వస్తాయా? అసలు వారి విమర్శలని ప్రజలు నమ్మి, టి‌డి‌పికి ఓటు వేద్దామని అనుకున్నవారు..వైసీపీకి ఓటు వేయాలని అనుకుంటారా? అంటే..అబ్బే ఒక్క ఓటు కూడా మారదని చెప్పవచ్చు.

పైగా టి‌డి‌పికి చెందిన నలుగురు, జనసేన నుంచి ఒక ఎమ్మెల్యేని వైసీపీ లాక్కుంది..ఆ విషయం ప్రజలకు తెలియనిది కాదు..అది వదిలేసి కొడాలి లాంటి వారు నీతులు చెప్పడం వల్ల వైసీపీకే అదనంగా డ్యామేజ్ అవుతుంది తప్ప..టి‌డి‌పికి పోయేదేమీ లేదు. కాబట్టి కొడాలి వల్ల వైసీపీకి పావలా ఉపయోగం లేదు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp