వైసీపీలో ఊహించని ట్విస్ట్.. అక్క‌డ టీడీపీకి హ్యాట్రిక్ ప‌క్కా…!

ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో వైసీపీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ వైసీపీ గెలవలేదు..ఇక నెక్స్ట్ ఎన్నికల్లో గెలుస్తుందనే నమ్మకం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ పార్టీలో ఉండే ఆధిపత్య పోరు బాగా నష్టం చేకూరుస్తుంది. ఇక్కడ వైసీపీని ఓడించేది సొంత పార్టీ వాళ్ళే అని తెలుస్తోంది.

ప్రకాశం జిల్లాలో బీ ట్యాక్స్ దందా... టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణలు

2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచు జూపూడి ప్రభాకర్ రావు పోటీ చేశారు..అప్పుడు ఆయన అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. సొంత పార్టీ వాళ్ళు సహకరించలేదని, అందుకే ఓడిపోయానని అప్పటిలో జూపూడి విమర్శలు చేశారు. ఆ ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి డోలా బాల వీరాంజనేయస్వామి విజయం సాధించారు. ఇక టి‌డి‌పి అధికారంలోకి రావడంతో జూపూడి సైతం టి‌డి‌పిలోకి వచ్చారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి కొండపిలో వైసీపీ నుంచి మాదాసి వెంకయ్య పోటీ చేశారు. ఈ సారి ఇక్కడ వైసీపీ గెలుస్తుందని అంతా అంచనా వేశారు.

కానీ అనూహ్యంగా వెయ్యి ఓట్ల మెజారిటీ తేడాతో వైసీపీ ఓడిపోయింది. మళ్ళీ టి‌డి‌పి నుంచి స్వామి గెలిచారు. అయితే ఇక్కడ ఉన్నకొద్ది టి‌డి‌పి బలం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇటు వైసీపీలో రోజురోజుకూ అంతర్గత పోరు పెరుగుతుంది. ఇప్పటికే వెంకయ్యని తప్పించి..వరికూటి అశోక్ బాబుని ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన కూడా పార్టీని బలోపేతం చేయలేకపోయారు. పైగా వెంకయ్య, అశోక్ వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ఇక మధ్యలో జూపూడి సైతం మళ్ళీ పార్టీలోకి వచ్చారు.దీంతో కొండపిలో వైసీపీలో రచ్చ నడుస్తోంది.

ఇదే క్రమంలో తాజాగా ఇంచార్జ్ అశోక్ సైతం..తన సీటు విషయంలో క్లారిటీ ఇచ్చారు.. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్‌ వచ్చినా, రాక పోయినా పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీని బట్టి చూస్తే అశోక్‌కు సీటు దక్కేలా లేదు. మొత్తానికి ఇక్కడ వైసీపీలో నడుస్తున్న రచ్చ వల్ల టీడీపీకి మళ్ళీ అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది..మరోసారి టి‌డి‌పి గెలిచి హ్యాట్రిక్ కొట్టేలా ఉంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp