2024లో ఒంటి చేత్తో ఆ ఎంపీని గెలిపిస్తోన్న చంద్ర‌బాబు..!

ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా అనే సంగతి తెల్సిందే. అయితే పేరుకు బాబు సొంత జిల్లా గాని ఇక్కడ వైసీపీ హవా ఎక్కువ ఉంది. కానీ ఈ సారి వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పి బాబు కష్టపడుతున్నారు. జిల్లాలో సత్తా చాటాలని చూస్తున్నారు. అదే సమయంలో ఎప్పుడు టి‌డి‌పికి దక్కే చిత్తూరు ఎంపీ సీటుని ఈ సారి దక్కించుకోవాలని చూస్తున్నారు.

 

ఎక్కువసార్లు చిత్తూరు ఎంపీ సీటుని టి‌డి‌పి దక్కించుకుంది..కానీ గత ఎన్నికల్లో టి‌డి‌పి ఓడిపోయింది. అలా ఓడిపోవడానికి ప్రధాన కారణం కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గడమే. ఎందుకంటే కుప్పంలో వచ్చే మెజారిటీ బట్టే చిత్తూరు ఎంపీ సీటుని టి‌డి‌పి సొంతం చేసుకుంటూ వస్తుంది. 1996 నుంచి 2014 వరకు వరుసగా టి‌డి‌పి చిత్తూరు ఎంపీ సీటుని గెలుచుకుంది.

అప్పటి నుంచి కుప్పంలో బాబుకు భారీ మెజారిటీలు వచ్చేవి. అందుకే వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. గత ఎన్నికల్లో కుప్పంలో బాబు మెజారిటీ తగ్గింది..అదే సమయంలో చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో వైసీపీ భారీ మెజారిటీ సొంతం చేసుకుంది. దీంతో ఎంపీ సీటు పోయింది. కానీ ఈ సారి కుప్పంలో బాబు భారీ మెజారిటీ వచ్చేలా ఉంది. దీంతో చిత్తూరు ఎంపీ సీటుని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు.

అదే సమయంలో పార్లమెంట్ పరిధిలో ఉన్న కొన్ని సీట్లలో టి‌డి‌పికి పట్టు పెరిగింది. నగరి, పలమనేరు లాంటి సీట్లలో గెలుపు అవకాశాలు ఉన్నాయి. చిత్తూరులో పోటాపోటి ఉంది. కుప్పంలో ఇంకా భారీ మెజారిటీ వస్తే చిత్తూరు ఎంపీ సీటుని టి‌డి‌పి కైవసం చేసుకోవడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp, ysrcp