వైసీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ ప్లాన్‌కు ‘ ఆదిరెడ్డి ‘ మార్క్‌ చెక్‌…!

రాజమండ్రి..డౌట్ లేకుండా తెలుగుదేశం పార్టీ కంచుకోట అనే చెప్పవచ్చు.. మొదట నుంచి రాజమండ్రిలో టీడీపీ హవా కొనసాగుతూనే వస్తుంది..అలాగే 2009లో రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాలుగా డివైడ్ అయినా సరే..రెండు చోట్ల టి‌డి‌పి సత్తా చాటుతూనే ఉంది. ఇక ఇందులో సిటీ స్థానంలో టి‌డి‌పి హవా స్పష్టంగా ఉంది. గతంలో ఇక్కడ టి‌డి‌పి నాలుగుసార్లు గెలిచింది..అది కూడా టి‌డి‌పి నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరీ గెలిచిన విషయం తెలిసిందే.

2014 నుంచి ఆయన రూరల్ నియోజకవర్గానికి వెళ్ళి గెలుస్తున్నారు. ఇక 2014 ఎన్నికల్లో సిటీ స్థానంలో బి‌జే‌పి గెలిచింది. అంటే టీడీపీతో పొత్తు ఉండటం వల్లే కేవలం బి‌జే‌పి గెలవగలిగింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో పూర్తిగా వైసీపీ గాలి ఉన్న విషయం తెలిసిందే. అయినా సరే రాజమండ్రి సిటీలో టీడీపీ మంచి మెజారిటీతో గెలిచింది. 30 వేల ఓట్ల మెజారిటీతో టి‌డి‌పి నుంచి ఆదిరెడ్డి భవాని గెలిచారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో భవాని బదులు ఆమె భర్త శ్రీనివాస్ పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

అయితే భవాని..ఎర్రన్నాయుడు కుమార్తె అనే సంగతి తెలిసిందే..ఇటు ఆదిరెడ్డి ఫ్యామిలీకి రాజకీయాల్లో మంచి పట్టు ఉంది. ఇలా రెండు ఫ్యామిలీల మద్ధతుతో భవాని సత్తా చాటారు. ఇక వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి శ్రీనివాస్ బరిలో దిగడం ఖాయమైంది..అందుకే భవాని ఎమ్మెల్యేగా ఉన్న సరే నియోజకవర్గంలోని పనులు గాని, పార్టీ కార్యక్రమాలు ఆయనే చూసుకుంటున్నారు. దీంతో ఆయనకు ప్రజా మద్ధతు ఎక్కువగా ఉంది.

వైసీపీ నుంచి ఇప్పటికే అనేక మంది నేతలు మారుకుంటూ వచ్చారు..చివరికి రాజమండ్రి ఎంపీ మార్గని భరత్..సిటీలో పనిచేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. భ‌ర‌త్ ఎమ్మెల్యే అవ్వాల‌ని ఎన్ని ప్లాన్లు వేస్తున్నా.. అటు సిటీలో టి‌డి‌పి బలం ఎక్కువ..ఆదిరెడ్డి ఫ్యామిలీకి పట్టు ఎక్కువ.. ఇలాంటి పరిస్తితుల్లో భరత్ అసెంబ్లీకి పోటీ చేస్తే ఆదిరెడ్డిని ఢీ కొట్టి అక్క‌డ పాగా వేయ‌డం అంత వీజీ అయితే కాదు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp, ysrcp