ఆ రోజు నాని అలా చేయకుండా ఉంటే.. కీర్తి బ్రతుకు బస్టాండే.. బయటపడ్డ నిప్పులాంటి నిజం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటికీ తక్కువ హిట్స్ అందుకొని ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న నటిగా పాపులారిటీ సంపాదించుకుంది కీర్తి సురేష్ . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే కామన్ గా అందరి పీపుల్స్ కి నచ్చే హీరోయిన్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు కీర్తి సురేష్ .

రీసెంట్ గా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో దసరా సినిమాలో హీరోయిన్గా నటించింది. ప్రజెంట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న కీర్తి సురేష్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట పెట్టాడు నాని . ఈ సినిమా స్క్రిప్ట్ అనుకున్న టైంలో శ్రీకాంత్ ఓదెల కీర్తి సురేష్ ని వెయిట్ పెరగమని చెప్పాడని.. దాదాపు 12 కేజీల వరకు బరువు పెరగమని సలహా ఇచ్చాడని.. అయితే కీర్తి సురేష్ అప్పట్లో ఈ విషయాన్ని లైట్గా తీసుకుంది అని నాని చెప్పుకొచ్చాడు. అంతేకాదు అప్పట్లో చూద్దాంలే అన్నట్లు కీర్తి సురేష్ లైటుగా తీసుకున్నాను అని ఆమె చెప్పేసింది.

ఆ తర్వాత హర్ట్ అయిన డైరెక్టర్ కీర్తి సురేష్ ను ఈ సినిమా నుంచి తీసేద్దామని అనుకున్నారట . ఆ టైంలోనే నాని “అక్కడ నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్..నువ్వు ఏమో డెబ్యూ ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటి.. కీర్తి గురించి నాకు బాగా తెలుసు .. ఆమె పాత్రకు న్యాయం చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చారట. ఈ క్రమంలోనే శ్రీకాంత్ కూడా కీర్తి పై నమ్మకంతో ఆ పాత్రను ఆమెకు ఇచ్చారట.

సినిమా చూసిన తర్వాత వెన్నెల పాత్ర కీర్తి సురేష్ కంటే మరి ఏ హీరోయిన్ బాగా చేయలేదు అంటూ ఫిక్స్ అయిపోయి కీర్తిని పొగిడేసాడట శ్రీకాంత్ . ఇదే విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు నాని . నాని ఒకవేళ ఆ రోజు అలా చెప్పకపోయుంటే కీర్తి బ్రతుకు బస్టాండ్ అయ్యుండేదని ..నాని కీర్తి సురేష్ జీవితాన్ని కాపాడాడని చెప్పుకొస్తున్నారు జనాలు..!!

Tags: Dasara, film news, filmy updates, intresting news, Keerthy Suresh, latest news, latest viral news, Nani, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news