హైద‌రాబాద్‌లో పేలిన కారు టైర్‌.. కారును ఈడ్చుకెళ్లిన లారీ ( వీడియో )

సీసీ ఫుటేజ్ వీడియోల వ‌ల్ల ఎక్క‌డ ఏం జ‌రిగిందో వెంట‌నే తెలుసుకునే వెసులు బాటు బాగా క‌లుగుతోంది. ఈ వీడియోల వ‌ల్ల జ‌రిగిన ప్ర‌మాదాలు, ఇత‌ర విష‌యాలు కూడా త‌ర్వాత తెలుసుకునేందుకు ఉప‌యోగం ఉంటోంది. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ యాక్సిడెంట్ ఫుటేజ్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

హైదరాబాద్ మైలార్ దేవ్‌పల్లి పరిధిలోని దుర్గానగర్లో ఆల్టో కారు లారి ముందు నుంచి స్పీడ్‌గా వెళుతోంది. ఉన్న‌ట్టు ఉండి ఒక్క‌సారిగా కారు టైర్ పేలింది. దీంతో వెన‌క‌గా వ‌స్తోన్న లారీని కారు అదుపుత‌ప్పి ఢీకొట్టింది. లారీ కారును డివైడ‌ర్ మ‌ధ్య‌లో పెట్టి కొంత దూరం ఈడ్చూకు పోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.