హీరో వెంక‌టేష్ నిర్మాత‌గా… ఆ స్టార్ హీరో, హీరోయిన్ల‌తో వ‌చ్చిన సినిమా తెలుసా… !

మన తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి కుటుంబానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఈ కుటుంబం నుంచి ముందుగా దగ్గుబాటి రామానాయుడు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా అడుగుపెట్టి నటరత్న ఎన్టీఆర్‌తో రాముడు భీముడు సినిమా తెరకెక్కించాడు. తొలి సినిమాతోనే భారీ విజయనందుకున్నారు. తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి భారతదేశంలోని అన్ని భాష‌ల్లో సినిమాలు తీసిన ఏకైక అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు రామానాయుడు.

Venkatesh Daggubati Age, Biography, Height, Place of Birth, News & Photos -  See latest

ఆయన తర్వాత ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఆయన పెద్దద కొడుకు సురేష్ బాబు కూడా టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఆయన చిన్న కొడుకు వెంకటేష్ కూడా టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. ఈ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసులుగా వచ్చిన రానా కూడా తన నటనతో పాన్‌ ఇండియా లెవ‌ల్‌ లో ఆదరగొడుతున్నాడు. రీసెంట్‌గా అహింస సినిమాతో రానా త‌మ్ముడు అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోలున్నా వెంకటేష్ నటన ఎంతో స్పెషల్. ఎలాంటి వివాదాలు లేని హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దగ్గుబాటి వెంకటేష్ తన 18 సంవత్సరాల వయసులో తనకు ఇష్టమైన హీరో కోసం ఓ ఇంట్ర‌స్టింగ్ ప‌ని చేశారు. ఇది ఆశ్చ‌ర్యంగా కూడా ఉంటుంది. వెంకటేష్ కు చిన్నతనం నుంచి అందాల నటుడు శోభన్ బాబు అంటే ఎంతో ఇష్టమట. వెంకటేష్ చిన్న వయసులోనే శోభన్ బాబుతో ఒక సినిమా నిర్మించాలని అనుకున్నారు.

ఎంకి నాయుడు బావ - వికీపీడియా

అది కూడా తన పేరుతో ఓ నిర్మాణ సంస్థ స్థాపించి ఆ సినిమా నిర్మించాలని వెంకటేష్ భావించారట. అప్పటికే తన సోదరుడు సురేష్ బాబు పేరుతో తన తండ్రి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించాడు. వెంకటేష్ తన 18 సంవత్సరాల వయసులోనే ఓ సినిమా నిర్మించాల‌నుకున్న‌ప్పుడు తండ్రి రామానాయుడు సురేష్ బ్యానర్‌పైనే చేయాలని చెప్పారట.

వెంకటేష్ మాత్రం తన తండ్రి మాట వినకుండా..వెంకటేష్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఒక ప్రత్యేక బ్యానర్ పెట్టి శోభన్ బాబును కలిసి ప్రపోజల్ చేశారట. దీంతో శోభన్ బాబు కూడా ఓకే అనడంతో 1978లో ఈ బ్యాన‌ర్ మీద‌ ఎంకి నాయుడు బావ అనే మూవీ శోభన్ బాబు – వాణిశ్రీ జంటగా తెర‌కెక్కింది. అలా వెంక‌టేష్ శోభ‌న్‌బాబు కోసం కేవ‌లం 18 ఏళ్ల‌కే నిర్మాత‌గా మారి సంచ‌ల‌నం క్రియేట్ చేశారు.