ఇందిరాగాంధీ మోసం చేసినా ఎన్టీఆర్ చేసిన గొప్ప ప‌ని ఇదే… ఆయ‌న సంస్కారానికి హ్యాట్సాఫ్‌..!

నందమూరి నట‌సార్వ‌భౌమ‌ ఎన్టీఆర్.. ఈ పేరు వింటే తెలుగువారు పొంగిపోతారు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఎన్నో కోట్ల మంది హృదయాల మదిలో ఇప్పటికీ అలానే నిలిచిపోయారు. సినిమాల్లోనే కాక రాజకీయాలోను రాణించిన సీనియర్ ఎన్టీఆర్ ప్రజల హృదయాలలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. రాజకీయాల పరంగా ఆయన సృష్టించిన చరిత్ర ఇప్పటివరకు ఎవరు తిరిగి రాయలేకపోయారు.

రాజకీయాల్లోకి వచ్చిన‌ అతి తక్కువ సమయంలోనే ముఖ్య‌మంత్రి అయ్యారు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ నరసయ్య ఎన్టీఆర్ గొప్పతనం గురించి త‌న తాజా ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలో ఆయనతో పాటు న‌ర‌స‌య్య వెళ్లాల్సి ఉన్నా కుద‌ర్లేదు. ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలోనే మంత్రుల్లో గూడుపుఠాణి మొదలైందని.. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనను చూస్తే నాకు జాలి వేసిందని తెలిపారు.

Memories of a different era

ఎన్టీఆర్ ను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన వారిలో నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఉన్నాడని ఆయన చేసిన మోసం ఎన్టీఆర్ కి తర్వాత అర్థమైందని.. ఆయనను పార్టీ నుంచి తొలగించారని చెప్పుకొచ్చారు నరసయ్య. అప్పుడు భాస్క‌రావు దగ్గర 25 మంది ఎమ్మెల్యేలు కూడా లేరట . ఇందిరాగాంధీ డైరెక్ష‌న్‌లో నాదెండ్ల‌ భాస్కరరావు సీనియర్ ఎన్టీఆర్ ను మోసం చేశార‌ని.. అదే సమయంలో ఇందిరాగాంధీ చనిపోయ‌రాని.. అయినా ఎన్టీఆర్ అవేవి ప‌ట్టించుకోకుండా ఎన్టీఆర్ ఢిల్లీ వెళ్లి మరి ఇందిరాగాంధీకి నివాళులు అర్పించార‌ని న‌ర‌స‌య్య తెలిపారు.

త‌న‌కు మోసం జరిగింది ఇందిరా గాంధీ వల్లే అని తెలిసినా సరే ఢిల్లీ వెళ్లి మ‌రీ నివాళులు అర్పించడంతో ఆయన సంస్కారం ఏంటో అర్థం అవుతుంది.. ఆ సమయంలో చంద్రబాబు లేకపోతే పార్టీ భూస్థాపితం అయ్యి ఉండేద‌ని నరసయ్య కామెంట్స్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.