లైవ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటి..? కండీషన్స్ అంత కఠినంగా ఉంటాయా..? ప్లస్ లు – మైనస్ లు ఇవే..!!

లైవ్ ఇన్ రిలేషన్ షిప్ ఇటీవల ఇది చాలామంది విషయంలో సర్వసాధారణంగా మారిపోయింది. కొన్నాళ్లగా ఎన్నో జంటలు లైవ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటూ బహిరంగంగా కనిపిస్తూనే ఉన్నారు. అయితే గత కొంత కాలంగా లివింగ్ రిలేషన్ షిప్ లో అనేక సమస్యలు అనేక సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల మీరా రోడ్ ప్రాంతంలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ వివాదం సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వివాదంతో మరొకసారి లైవ్ ఇన్ రిలేషన్ షిప్ చర్చనీయాంసమయింది. ఇకపోతే లైఫ్ ఇన్ రిలేషన్ షిప్ వల్ల కలిగే ప్లస్ లు మైనస్ లు ఏంటో ఒకసారి చూద్దాం.

Live in Relationship law in india | Indiafilings Official

లైవ్ ఇన్ రిలేషన్షిప్ ప్రయోజనాలు :

లైవ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండడం వల్ల ఒకరినొకరు మరింత అర్థం చేసుకోవడానికి సమయం దొరకడంతో పాటు వారి అలవాట్లు ఇష్టాలు కూడా తెలుస్తాయి. లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఫ్యూచర్ లో జంట ఎదుర్కోవాల్సిన టాస్క్ ఎలా ఉంటాయి. ఆ టాస్క్ ని మనం నిర్వర్తించగలమా అనే దానిపై అవగాహన వస్తుంది.అలానే ఒకరి స్వభావం ఏంటో మరొకరికి తెలుస్తుంది. ఒకరి అభిప్రాయాలు మరొకరి అభిప్రాయాలతో కలవక పోయినప్పుడు అడ్జస్ట్ అవ్వగలమా లేదా..?” అనే దానిపై అవగాహన రావడంతో పాటు ఆర్థికపరంగా కూడా మనం ఎలా ముందుకు వెళ్ళవచ్చు అనేదానిపై అవగాహన వస్తుంది.

లైవ్ ఇన్ రిలేషన్షిప్ వల్ల కలిగే నష్టాలు :

లివ్ ఇన్ రిలేషన్షిప్ లో మొదట్లో సంతోషంగా ఉన్నప్పటికీ తర్వాత ఆర్థికపరంగా మనస్పర్ధలకు దారి తీయవచ్చు. ఇద్దరు సంపాదిస్తున్నట్టయితే ఆర్థిక పరంగా నేనేం తక్కువ కాదు అంటే నేనేం తక్కువ కాదు అంటూ గొడవలు పెరుగుతాయి. దీంతో వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ తగ్గుతుంది. ఆర్థికమైన గొడవలు ఇలాంటి సంఘటనలు తలెత్తాయో ఇప్పటికే మనం చూస్తున్నాం. లివ్ ఇన్ రిలేషన్ షిప్ ద్వారా చిన్నచిన్న గొడవలు జరిగినా ఇద్ద‌రి మ‌ద్య‌న‌ యాక్సెప్టెన్సీ తగ్గిపోతుంది. ఇద్దరం సంపాదిస్తున్నాం కాబట్టి ఇద్దరిలోనూ ఎటువంటి అర్హత భావం ఉండకూడదు అని భావిస్తారు.

Is Live in Relationship Legal in India? - Vidhikarya

ఇక అసలు విషయానికి వస్తే లివింగ్ రిలేషన్ షిప్ కి భారత దేశంలో ఎటువంటి చట్టం లేదు ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలో స్వతంత్రంగా జీవించే హక్కు ఉంది. దీని ద్వారా లివ్ ఇన్ రిలేషన్ షిప్ ను ఆమోదించారు. ఇద్దరు పెళ్లి చేసుకోకుండా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు ఇది చట్ట విరుద్ధం కాదు. కానీ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తి తరువాత వేరొక వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు వివాహిత వ్యక్తి జీవిత భాగస్వామి ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు దానిపై అధికారికంగా క్లేయిమ్ చేయవచ్చు.

దానివల్ల ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి. అవి ఆర్థిక హక్కులే కాక మరి ఇంకేమైనా కావచ్చు. రిలేషన్షిప్ పై భారత పార్లమెంటే కాదు ఏ రాష్ట్ర శాసనసభ కూడా మంచి కాండిఫికేషన్ యాక్ట్ రూపొందించలేకపోయింది. కానీ గృహ హింస‌ చట్టం 2005లో సెక్షన్ 2 ప్రకారం లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న వారు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొన్న చట్ట ప్రకారం భారతీయ చట్టం లివింగ్ లో న్యాయం చేయగలదు.

LEGAL VALIDITY AND IMPLICATIONS OF LIVE-IN RELATIONSHIPS IN INDIA – Lexlife  India

లివ్ ఇన్ రిలేషన్ షిప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ :
1.లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండే జంట మధ్య కాలవ్యవధి అవసరం.
2.భార్యాభర్తలుగా ఇద్దరు ఒకే ఇంట్లో ఒకే రూమ్ లో ఉండడం తప్పనిసరి.
3.ఇద్దరు ఇంటి పనిలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.
4.వారి బిడ్డలను తమ‌తో ఉంచుకోవచ్చు.
5.వీరీ బంధం బహిర్గతంగానే ఉండాలి రహస్య సంబంధాలను మెయింటైన్ చేయకూడదు.
6.వ్యక్తులు మేజర్స్ అయి ఉండాలి. ఎవరి బలవంతంతో కాదు.
7.వీటితోపాటు ప్రధానంగా ఎవరికీ మునుపటి భాగస్వామి ఉండకూడదు.