రెచ్చిపోయిన బ‌లగం హీరోయిన్ కావ్య‌… డ‌బ్బులిస్తే బెడ్ రూమ్‌లో ఆ ప‌ని కూడా చేస్తానంటూ బోల్డ్ ర‌చ్చ‌..!

టాలీవుడ్‌లో ఎంతమంది స్టార్ హీరోయిన్లు ఎంద‌రు ఉన్నా తెలుగు అమ్మాయిలో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇటీవల బలగం సినిమాతో గ్రాండ్ సక్సెస్‌ సొంతం చేసుకుంది తెలుగు బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ ఒక‌రు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించి.. నేషనల్ అవార్డు సైతం దక్కించుకుంది బలగం సినిమా. ఈ సినిమాకు జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో వేణుకు చిరంజీవి లాంటి స్టార్ హీరోల నుంచి ప్రశంసలు అందాయి. ఇక కావ్య గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. కావ్య కళ్యాణ్ రామ్ 2022లో ఉస్తాద్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మసుద‌, బలగం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బ‌లగం సినిమా తర్వాత వరుస ఛాన్సులు కొట్టేస్తోంది. కావ్య ఇటీవల సినిమాల విష‌యంలో చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ర‌చ్చ లేపుతున్నాయి.

సినిమా అవకాశాల విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదని.. డబ్బులు ఎక్కువగా ఇస్తానంటే ఇంటిమేట్ సీన్స్, బోల్డ్ సీన్స్, బెడ్రూమ్ సీన్స్ ఇలా అన్ని సన్నివేశాల్లో నటించడానికి నేను ఓకే అంటూ బోల్డ్‌ కామెంట్స్ చేసింది కావ్య. ఈ బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కొంతమంది నెటిజ‌న్లు కావ్య నువ్వు ఇంత బోల్డ్‌నా ? డబ్బులు ఇస్తే బెడ్ రూమ్ సీన్స్ అయినా నీకు ఓకేనా అంటూ వ‌ల్గ‌ర్ కామెంట్స్‌తో ఆమెను టార్గెట్ చేస్తున్నారు.

కొంద‌రు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్లు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ బికినీలు వేయడానికి, బెడ్ రూమ్ సీన్స్ చేయడానికి… రొమాంటిక్ సన్నివేశాలు, హాఫ్ న్యూడ్ గా నటించడానికి కూడా సై అంటున్నారు… ఇలాంటి సీన్ల‌లో కావ్య కళ్యాణ్ రామ్ న‌టించ‌డంలో తప్పేముంద‌ని ఆమెకు స‌పోర్ట్‌గా మాట్లాడుతున్నారు.