ఈ ఫొటోలో మ‌హేష్ ప‌క్క‌న ఉన్న బుడ్డోడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో… ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..!

సినిమా సెలబ్రిటీలు హీరోలు, హీరోయిన్ల చైల్డ్ హుడ్‌ ఫోటోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ల చిన్నప్పుడు ఎలా ఉన్నారు ? ఇప్పుడు ఎలా ఉన్నారు ? అన్నది రెండు ఫోటోలు పక్కపక్కన పెడితే అసలు గుర్తుపట్టాలేకపోతున్నాం. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొడుతోంది.

Mahesh Babu: There are shades of Pokiri in Sarkaru Vaari Paata |  Entertainment News,The Indian Express

పై ఫోటోలో సూపర్ స్టార్ మహేష్ పక్కన ఉన్న చిన్నోడు ఎవరో మీరు గుర్తుపట్టారా ? ఆ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ హీరో. ఇప్పటికే ఒక హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్న ఆ హీరో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలాగే ఒక పెద్ద బ్యానర్ లోను ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇంతకు ఆ యంగ్ హీరో ఎవరో ? కాదు సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. శ్రీకాంత్, సీనియర్ హీరోయిన్ ఊహ దంపతుల తనయుడు అయిన రోషన్ నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Nirmala Convent (2016) Telugu Movie Online Watch Full Length HD

అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. నటనాపరంగా తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఆ సినిమా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కే రాఘవేంద్రరావు దర్శకత్వ‌ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోకుండా.. కథలో బలంతో పాటు తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే ఎంపిక చేసుకుంటున్నాడు.

Nirmala Convent Review ,Nirmala Convent Rating,

ఈ క్రమంలోనే వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఒక పెద్ద సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు పక్కన రోషన్ చిన్నప్పుడు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోషన్ ఎంతగా మారినా మహేష్ బాబు మాత్రం అప్పుడు ఎలా ? ఉన్నాడో ఇప్పుడు అంతే అందంగా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, mahesh babu, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news