బిగ్ బ్రేకింగ్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ విడాకులు… ఆమె ఎవ‌రంటే…?

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలోనూ, చిత్ర పరిశ్రమలోనూ వైరల్ గా మారింది. టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ ఆశిన్ విడాకులు తీసుకోబోతుందా అంటే ? అవును అనే సమాధానం వస్తుంది. చిత్ర పరిశ్రమలో తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్లో కూడా సినిమాలు చేసి అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా మారింది ఆసిన్.

గతంలో ఆశిన్ సినిమాలో నటిచ్చిందంటే చాలు అది సూపర్ డూపర్ హిట్ అనే టాక్ కూడా ఉండేది. మరీ ముఖ్యంగా గజిని సినిమా హిట్ అయిన తర్వాత ఆశిన్ కెరీర్ మరో లెవల్ కి వెళ్లింది. అదే సమయంలో బాలీవుడ్లో ఆశిన్ అక్షయ్ కుమార్ తో కలిసి ఆల్ ఈజ్ వెల్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా సమయంలోనే ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ శర్మతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఈ క్ర‌మంలోనే మైక్రో మ్యాక్స్ అధినేత రాహుల్ శర్మను ఆశిన్ 2016లో పెళ్లి చేసుకుంది. అదే సమయంలో చిత్ర పరిశ్ర‌మ‌లో హీరోయిన్‌గా మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని చిత్ర పరిశ్రమకు దూరమైన ఆశిన్ తర్వాత తన ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఎంతో హ్యాపీగా ఉంది. ఇక‌ ఇప్పుడు ఆశిన్ తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే ఓ రూమర్ సోష‌ల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు జరిగాయని… అందుకే ఇద్దరు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారట. అంతేకాకుండా ఆశిన్ భర్తకు ఆల్రెడీ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం కూడా ఉందనే విషయం ఆశి కు చాలా లేటుగా తెలిసింద‌న్న పుకార్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఈమె ఒక పాప పుట్టినా సరే అతనికి విడాకులు ఇచ్చేయాలని నిర్ణయించుకుందట.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ గా మారింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఆశిన్ నుంచి ఎలాంటి స్పంద‌నా లేదు. అస‌లు ఇందులో నిజానిజాలు ఏంట‌న్న‌ది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.