అక్కినేని కుటుంబానికి ఉన్న శాపం ఏంటి… అందుకే ఆ ఇంట్లో పెళ్లిళ్లు కలిసి రావడం లేదా..!

తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎప్ప‌టికి గుర్తుంచుకునే హీరోల‌లో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు. ఆయన తర్వాత ఈ ఫ్యామిలీ నుంచి నాగార్జున చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. నాగార్జున తర్వాత కూడా ఈ కుటుంబం నుంచి మూడోతరం హీరోలుగా సుమంత్, నాగచైతన్య, అఖిల్ సుశాంత్ వంటి హీరోలు టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఇక ఇదే సమయంలో అక్కినేని ఫ్యామిలీ గురించి తెలిసిన ఎవరికైనా సరే ఈ విషయం నిజం అనాల్సిందే.

నాగార్జునతో మొదలుపెట్టి యంగ్ హీరో అఖిల వరకు ఈ ఫ్యామిలీలో మొదటి పెళ్లి ఎవరికీ కలిసి రాలేదు.
నాగార్జున ముందుగా ద‌గ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకొని నాగచైతన్యకు జన్మనిచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ అమ‌లను ప్రేమించి తండ్రి నాగేశ్వరావుని ఎదిరించి పెళ్లి చేసుకుని అఖిల్ కి జన్మనిచ్చాడు. ఇలా నాగార్జునతోనే ఈ కుటుంబంలో మొదటి పెళ్ళి కలిసి రాకుండా పోయింది.

ఆ తర్వాత అక్కినేని మేనకోడలు సుప్రియ విషయంలో కూడా ఇదే జరిగింది.సుప్రియ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత హీరో చరణ్ రెడ్డితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు.
ఇక మధ్యలో చరణ్ రెడ్డి చనిపోయాడు. ఇక ఆ తర్వాత సుప్రియ తమ్ముడు సుమంత్ కూడా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఈ జంట కూడా పెళ్లైన రెండు సంవత్సరాలకి మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడిపోయారు. విడాకులు తర్వాత కీర్తి రెడ్డి, కార్తీక్ అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయిపోయింది. ఇక సుమంత్ ఇప్పటివరకు మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయాడు. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య కూడా స్టార్ హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకుని కనీసం ఐదు సంవత్సరాలు కూడా అవకుండానే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.

నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా శ్రేయ భూపాల్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. పెళ్లికి నెలరోజుల సమయం ఉంద‌నగా అభిప్రాయ బేధాలు వచ్చి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇలా ఈ అక్కినేని కుటుంబంలో ఒక్క నాగేశ్వరరావు మినహా ఈ కుటుంబంలో అందరూ మొదటి పెళ్లి చేసుకుని విడిపోయిన వారే. అయితే ఇప్పుడు ఈ విషయం తెలిసిన చాలామంది అక్కినేని కుటుంబంకు పెళ్లిళ్ల విషయంలో వారికి ఏదైనా శాపం ఉందా ? అంటూ వారికి పెళ్లిళ్లు కలిసి రావట్లేదు అంటూ చెప్పుకుంటున్నారు.