బాడీలో ఈ చిన్న మైన‌స్సే అప్ప‌ట్లో ప‌విత్ర స్టార్ హీరోయిన్ కాకుండా అడ్డు ప‌డిందా…!

పవిత్ర లోకేష్ గత కొన్ని రోజులుగా తెలుగులో ఈమె పేరే హాట్ టాపిక్. తాజాగా ఈమె సీనియర్ హీరో నరేష్‌ హీరోగా నటించిన ‘మళ్ళీ పెళ్లి’ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సంచ‌ల‌నంగానే మారింది. గత కొన్ని రోజులుగా వీళ్లిద్దరు లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనల సమాహారంగా తెరకెక్కిన సినిమా మళ్ళీ పెళ్ళి.

ఒకపుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈమె స్టార్ హీరోయిన్ కావాల్సిన మెటీరియల్. అయినా ఈ భామ ఎందుకు ? స్టార్ హీరోయిన్‌ కాలేకపోయిందో అని అందరు చర్చించుకుంటున్నారు. గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న నరేష్ – పవిత్ర కలిసి నటించిన మళ్లీ పెళ్లి సినిమా రీసెంట్ గానే ప్రేక్షకులు ముందుకు వచ్చి హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. పవిత్రా లోకేష్ మాత్రం ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తల్లిగా, అత్తగా పలు పాత్రలో నటిస్తూ మెప్పిస్తుంది.

అయితే ఈమె కెరీర్ మొదట్లో ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన కూడా స్టార్ హీరోయిన్‌గా రాణించలేకపోయింది. అప్పట్లో గ్లామర్ పాత్రలతో అప్పటి హీరోయిన్లకు పోటీ ఇచ్చిందని ఈమె సినిమాలు చూస్తూనే తెలుస్తుంది. అయితే హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని అందం ఈమె సొంతం. అయినాస‌రే ఆమె హీరోయిన్ గా స‌క్సెస్ కాలేక‌పోయింది.. అందుకు ముఖ్యకారణం ఆమె హైట్.. అప్పటి హీరోల కంటే ఈమె హైట్‌గా ఉండటంతో ఎక్కువగా హీరోయిన్ గా అవకాశాలు రాలేదని అంటారు.

ఇక క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో ప‌విత్ర హీరోయిన్‌గా ఎంట్రి ఇచ్చే స‌మ‌య‌నికి అక్క‌డ స్టార్ హీరోలుగా ఉన్న వారు అంద‌రు ప‌విత్ర కంటే హైట్‌లో త‌క్కువ‌గా ఉండేవారు. 5.10 అడుగుల ఎత్తు ఉన్నా ప‌విత్ర లోకేష్ ముందు హీరోలు అసలు సెట్ అయ్యేవారు కాదు. ఇక దీంతో దర్శక నిర్మాతలు హీరోయిన్‌గా తీసుకునేందుకు వెనకడుగు వేసే వారు. ఇక‌ దీంతో చేసేదేమీ లేక పవిత్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయింది.