వ్య‌భిచార రాకెట్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన హీరోయిన్‌…!

సినిమా అనేది ఓ రంగుల ప్ర‌పంచం. ఈ రంగుల ప్రపంచంలో అవకాశాల కోసం ఇబ్బందులు ప‌డే వారిని ర‌క‌ర‌కాల ఆశ‌ల‌తో మోసం చేసే వారు ఎక్కువ అయ్యారు. మ‌రీ ముఖ్యంగా అమ్మాయిలు ఈ వ‌ల‌లో ప‌డి త‌మ జీవితాలు అర్పించేస్తున్నారు. తీరా మోస‌పోయాక కాని వారు అస‌లు నిజాలు తెలుసుకోవ‌డం లేదు. కెరీర్ ప్రారంభంలో ఎలాంటి అమ్మాయిలు అయినా అవ‌కాశాల కోసం త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నారు.. త‌ప్పుడు ప‌నులు చేస్తున్నారు.. వారు అలా చేసేలా కొంద‌రు ప్రోత్స‌హిస్తున్నారు.. ప్రేరేపిస్తున్నారు.

 

ఈ క్ర‌మంలోనే ముంబైలో సెక్స్ రాకెట్ న‌డుపుతోన్న ఓ న‌టిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ న‌టి పేరు ఆర్తి మిట్టల్ ఎవరు. ఆర్తీ సోషల్ మీడియాల్లోను ఎంతో యాక్టివ్. ఆమెకు టాప్ టెలివిజన్ తారలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆమె సోష‌ల్ మీడియాలో ఏకంగా హితేన్ తేజ్వానీ- రోహిత్ రాయ్- మానవ్ గోహిల్- అమన్ వర్మ సహా మరికొందరితో ఉన్న ఫోటోలు ఉన్నాయి.

సినిమాల్లో హీరోయిన్లు అవ్వాల‌న్న కోరిక‌తో ఇండస్ట్రీలోకి వ‌చ్చేవారు.. మెడల్స్‌కు అవ‌కాశాల ఆశ చూపుతూ ఆమె వారిని వ్య‌భిచార దందాలోకి దింపుతోంది. ఆర్తి పలు టీవీ షోలు, సీరియళ్లలో నటించారు. సోష‌ల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఆర్తీ ఎప్పుడూ టాప్ టెలివిజన్ నటులతో దిగిన ఫొటోలు షేర్ చేస్తూ చాలా మందిని బుట్టలో వేసుకుంటోంది.

 

తాజాగా ఆమె సెక్స్ రాకెట్ న‌డుపుతోంద‌ని.. ఛాన్సుల పేరుతో మోడ‌ల్స్‌, కొత్త అమ్మాయిల‌కు డ‌బ్బులు కూడా ఆశ చూపి ఈ ఉచ్చులోకి దింపుతోంది. దీనిపై కూపీ లాగిన ముంబై పోలీసులు ఓ ప్లాన్ వేసి ఆమెను ప‌ట్టుకున్నారు. ముందుగా ఆమెను ఇద్దరు అమ్మాయిలను ఓ హోటల్ కు పంపాలని కోరగా.. ఆర్తి ఏకంగా రూ.60 వేలు డిమాండ్ చేసింది. ఇద్ద‌రు మోడ‌ల్స్‌తో క‌లిసి హోట‌ల్‌కు వ‌చ్చిన ఆర్తీని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని విచారించ‌గా ఆమె చేస్తోన్న బాగోతం అంతా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Tags: arthi, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news