‘ ద‌స‌రా ‘ టాక్ అరాచ‌కం… ఆ ఒక్క కంప్లైంట్ లేక‌పోతే కేజీయ‌ఫ్ రేంజ్ హిట్ట‌య్యేది…!

నేచురల్ స్టార్ నాని న‌టించిన తొలి పాన్ ఇండియా సినిమా ద‌స‌రా ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు దిగుతోంది. నాని న‌టించిన తొలి పాన్ ఇండియా సినిమాగా ద‌స‌రా వ‌స్తోంది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్లు ప‌డిపోవ‌డంతో సినిమా చూసిన ప్రేక్ష‌కులు, విశ్లేష‌కులు ట్విట్ట‌ర్ ద్వారా త‌మ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇక ఈ సినిమా చూసిన వారంతా నాని న‌ట‌న‌కు పూన‌కాల‌తో ఊగిపోయామ‌ని చెపుతున్నారు.


నాని న‌ట‌న ద‌స‌రాకు ముందు.. ద‌స‌రాకు త‌ర్వాత అనే రేంజ్‌లో ఉంద‌ని.. నాని న‌ట‌న‌తో అద‌ర‌గొట్టేశాడంటూ ప్ర‌శంస‌లు కురిపించేస్తున్నారు. తెలంగాణ‌లోని గోదావ‌రిఖ‌ని స‌మీపంలో ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన ఈ రా అండ్ ర‌స్టిక్ క‌థ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసింద‌ని అంటున్నారు. క‌థ‌లోకి వెళితే హీరో నాని ధ‌ర‌ణి పాత్ర‌లో క‌నిపిస్తాడు. సింగరేణిలో బొగ్గుగని కార్మికుడు. అన్యాయాన్ని సహించ‌లేని మ‌న‌స్త‌త్వం.. ప్రేమిస్తే ప్రాణ‌మిచ్చేస్తాడు.. అడ్డొస్తే లేపేస్తాడు.

నాని ‘ ద‌స‌రా ‘ రివ్యూ…. పాన్ ఇండియా లెవ‌ల్లో పూన‌కాలు

సింగరేణిలో ఓ కాంట్రాక్టర్ చేసే అన్యాయానికి ఎదురు తిర‌గ‌డంతో పాటు భీక‌రంగా పోరాడ‌తాడు. క‌థ రొటీనే అయినా క‌థ‌నం, బిగి స‌డ‌ల‌ని స‌న్నివేశాలు, నాని అసాధార‌ణ న‌ట‌న అదిరిపోయాయి. నాని మాస్‌లుక్స్‌తో విశ్వ‌రూపం చూపించేశాడు. ఇక వెన్నెల‌గా కీర్తి సురేష్‌, విల‌న్‌గా చేసిన మలయాళ నటుడు షైన్ చాకో పాత్రల్లో జీవించారు. వెన్నెలాంటి ప్రేయసి మనకూ ఉండాల‌ని ప్రేక్ష‌కులు కీర్తి పాత్ర‌తో క‌నెక్ట్ అవుతారు.

ఇక ధ‌ర‌ణికి ఫ్రెండ్‌గా చేసిన కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టికి కూడా మంచి మార్కులే పడ్డాయి. శ్రీకాంత్ ఓదెల ఎక్క‌డా ప‌ట్టు కోల్పోకుండా క‌థ‌ను నెరేట్ చేసిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. కొన్ని చోట్ల హాలీవుడ్ టేకింగ్ స్ఫురిస్తుంది. తెలంగాణ భాష‌, క‌ల్చ‌ర్‌తో పాటు ఆ ప్రాంత భావోద్వేగాలు కూడా గుర్తుకు వ‌స్తాయి. నాని ప్రాణం పెట్టేసి మ‌రీ న‌టించాడు. ప్రేమ‌, అటు క‌సిగా ఉండడం.. కోపంతో అర‌వ‌డం, న‌ర‌క‌డం ఏ సీన్ అయినా చెల‌రేగిపోయాడు.


పుష్ప‌ను మించి యాక్ష‌న్ సీన్ల‌లో న‌టించేశాడు. ఇక ప్రేమ స‌న్నివేశాల్లో ఎప్పట్లాగే చిలిపితనం, సున్నితత్వం, సరదాలతో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్ర‌ఫీ అస‌లు సీన్ల‌ను హైలెట్ చేసేలా ఉంది. సినిమాలో చాలా సీన్లు నేచుర‌ల్‌గా వ‌చ్చాయంటే కెమేరా ప‌నిత‌నం మెచ్చుకోవాలి. థియేటర్స్‌లో నాన్ స్టాప్ విజిల్స్ పక్కా అంటున్నారు. ఇక ఇంట‌ర్వైల్, క్లైమాక్స్ అయితే ర్యాంప్‌. నాని బ్లాక్బ‌స్టర్ కొట్టేశాడు. అయితే స్లో నెరేష‌న్ కంప్లైంట్ లేకుండా ఉండి ఉంటే ఖ‌చ్చితంగా పాన్ ఇండియాలో పెద్ద సినిమాల రేంజ్‌ను మించి పోయి ఉండేద‌నే అంటున్నారు.