నాని ‘ ద‌స‌రా ‘ రివ్యూ…. పాన్ ఇండియా లెవ‌ల్లో పూన‌కాలు

నేచురల్ స్టార్ నాని నటించిన తొలి పాన్ ఇండియా సినిమా దసరా శ్రీరామ మీ కానుకగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని గత సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటున్న కమర్షియల్ గా సక్సెస్ అవటం లేదు. అయితే ఈసారి దసరాతో పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హిట్‌ కొడతానని ముందు నుంచే మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమా స్టిల్స్ – టీజ‌ర్లు – ట్రైలర్లు అదిరిపోయాయి. దీనికి తోడు పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్లు చేశారు. నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుందో చూద్దాం.

ఈ సినిమా ఫ‌స్టాఫ్ చూస్తే డీసెంట్ గా ఉంది. నాని తన పాత్రలో చాలా సహజంగా ఆకట్టుకున్నాడ‌నే చెప్పాలి. ఇంటర్వెల్ పార్ట్ చాలా చాలా బాగుంది. కీలక సన్నివేశాల్లో సంతోష్ నారాయణన్ బీజీఎం సాలిడ్ గా మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. ఈ క‌థ అంతా మద్యపాన నిషేదం సమయం (మద్యపాన నిషేధ ఉద్యమం) నేపథ్యంలో సాగుతుంది. మంచి బ‌ల‌మైన క‌థాంశాన్ని ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ తీసుకున్నాడు.

ఫ‌స్టాఫ్ అదిరిపోగా… ఆ ఊపును సెకండాఫ్‌లో ద‌ర్శ‌కుడు కంటిన్యూ చేయ‌లేక‌పోయాడు. అయినా సినిమాకు అదిరిపోయే టాక్ వ‌చ్చింది. సెకండాఫ్ అక్క‌డ‌క్క‌డా కాస్త స్లో అయిన‌ట్టు ఉన్నా అది సినిమా విజ‌యానికి ఇబ్బందిగా ఉండ‌దు. నాని అసాధార‌ణ‌మ‌మైన న‌ట‌న క‌న‌ప‌రిచాడు. నాని ఈ సినిమాతో న‌ట‌నా ప‌రంగా మ‌రో మెట్టు ఎక్కేశాడు. అటు కీర్తి సురేష్ కూడా మంచి పెర్పామెన్స్ ఇచ్చింది.

ఈ సినిమాతో టాలీవుడ్‌కు శ్రీకాంత్ ఓదెల రూపంలో మ‌రో మంచి ద‌ర్శ‌కుడు దొరికాడు. ఈ సినిమా త‌ర్వాత పెద్ద హీరోలు శ్రీకాంత్‌కు పిలిచి మ‌రీ ఛాన్స్ ఇస్తారు. సినిమాలో డైలాగుల‌తో పాటు యాక్ష‌న్ బ్లాక్స్ చాలా బాగున్నాయి. సినిమాకు కాస్త స్లో నెరేష‌న్ వదిలేస్తే కంప్లైంట్స్ ఏం లేవు. నానికి పాన్ ఇండియా లెవ‌ల్లో అదిరిపోయే హిట్ ద‌క్కిన‌ట్టే అని చెప్పాలి.