సిక్స్ కొట్టి అదే బంతికి అవుటైన దుర‌దృష్ట‌వంతుడు.. ఎలాగో చూడండి ( వీడియో )

ప్రపంచంలో సినిమాలతో పాటు అందరూ ఎంతో ఎక్కువగా చూసే వాటిలో క్రికెట్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇదే సమయంలో కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2023 డివిజన్‌ వన్‌ పోటీల్లో ఎవరు ఊహించిన విధంగా ఓ వింత సంఘటన జరిగింది. అసలు వివరాల్లోకి వెళితే కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2023 డివిజన్‌ వన్‌ పోటీల్లో భాగంగా వార్విక్‌షైర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మిడిల్‌సెక్స్ కెప్టెన్ టోబీ రోలాండ్ జోన్స్ ఎవ‌రు ఉహించ‌ని విధంగా వింత పద్ధతిలో ఔటయ్యాడు.

ఎడ్‌ బెర్నార్డ్‌ బౌలింగ్‌లో 15వ బంతిని సిక్సర్‌గా మలిచిన టోబీ.. అదే బంతికి హిట్ వికెట్‌గా అవుట్ అయ్యాడు. భారీ సిక్సర్ కొట్టిన‌ అతను అదే ఆనందంలో వెనక్కి జరుగుతూ బ్యాట్‌ను స్వింగ్ చేశాడు. అదే సమయంలో వెనక వికెట్లు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాడు. బ్యాట్‌ను వెనక్కి అంటున్న స‌మ‌యంలోనే వికెట్‌ల‌కు త‌గిలింది. ఈ విషయాన్ని గమనించిన వికెట్ కీపర్ అప్పీల్ చేయగా.. రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. టోబీ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అత్యంత అరుదైన హిట్ వికెట్‌గా ఇది క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుందని కామెంట్ చేస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. టోబీ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.