జిమ్‌లో చెమ‌ట‌ల్లో హాట్ హాట్‌గా క‌వ్విస్తోన్న మెగాకోడ‌లు… వ‌రుణ్ చూస్తున్నావా..!

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి అతి తక్కువ సమయంలోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ముందుగా లావణ్య బుల్లితెరపై తన కెరీర్‌ మొదలు పెట్టింది అదే సమయంలో దర్శకుడు హను రాఘవపూడి ఆమెకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా వచ్చిన సినిమానే అందాల రాక్షసి.

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ త‌ర్వాత‌ వరుస సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంది ఈ సొట్ట బుగ్గల సుందరి. దాంతో లావణ్యకు ఆఫర్స్ క్యూ కట్టాయి. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడ్డ లావణ్య త్వరగా ఫేడ‌వ‌వుట్ అయ్యింది. కేవలం పదేళ్లలో ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. అయితే మెగా ఫ్యామిలీ కోడలిగా వార్తల్లో నిలిచింది. లావణ్య.. త్వ‌ర‌లోనే వరుణ్ తేజ్ భార్య కానుంది.

జూన్ 9న వరుణ్- లావణ్య ఎంగేజ్మెంట్ కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు సన్నిహితులు కూడా హాజరయ్యారు. త్వ‌రలోనే వీరి వివాహం జరగనుంది. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. త్వరలోనే దీనిపై కూడా అధికార ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ ఫోటోలు షేర్ చేసింది.

ఆ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ చెమటలు చిందిస్తుంది. ఆ ఫోటోల‌లో లావణ్య ఎంతో హాట్ లుక్స్ లో కనిపిస్తూ అందర్నీ టెంప్ట్‌ చేస్తుంది. ఇక దీంతో సోషల్ మీడియాలో ఆ ఫోటోలపై నెటిజ‌న్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.. వరుణ్ తేజ్ చూస్తున్నావా నీకు కాబోయే భార్య ఏం చేస్తుందో అంటూ లావణ్య ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.