నెల్లూరులో ఆ సీటు ప‌క్కా టీడీపీదే… కానీ స‌రైన క్యాండెట్ లేడే…!

చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది..ఎప్పుడో 1999 ఎన్నికల్లో అక్కడ టి‌డి‌పి సత్తా చాటింది. మళ్ళీ తర్వాత ఎప్పుడు మంచి విజయాలు సాధించలేదు. గత రెండు ఎన్నికల్లో జిల్లాలో టి‌డి‌పికి దారుణమైన ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో అయితే ఒక్క సీటు గెలుచుకోలేదు. అలాంటి పరిస్తితి నుంచి టి‌డి‌పి ఇప్పుడు పికప్ అవుతుంది. వైసీపీపై వ్యతిరేకత పెరగడం టి‌డి‌పికి కలిసొస్తుంది.

Ramireddy Pratap Kumar Reddy | MLA | YSRCP | Kavali | Nellore | A.P.

ఇప్పటికే వైసీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. అది కూడా ముగ్గురు రెడ్డి వర్గం నేతలే. అలాగే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే క్రమంలో కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. గత రెండు ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలిచారు..వైసీపీ నుంచి గెలిచిన ఆయన కావలికి చేసిందేమి లేదు. అధికారంలో ఉన్నా సరే అభివృద్ధి చేసింది లేదు.

దీనికి తోడు సొంత పార్టీలోనే ఎమ్మెల్యేపై వ్యతిరేకత వచ్చింది. పైగా ఏ కాంట్రాక్టులు చేసిన వైసీపీ వాళ్ళకు బిల్లులు రాని పరిస్తితి.. దీంతో సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. ఇక ఎమ్మెల్యే వైఖరి పట్ల వైసీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు చెక్ పెట్టే దిశగా కొందరు నేతలు పనిచేస్తున్నారని తెలిసింది. అందుకే తాజాగా ఎమ్మెల్యే సైతం సొంత పార్టీ వాళ్లపైనే విమర్శలు చేశారు. ఈ పరిణామాలు చూసుకుంటే కావలిలో టి‌డి‌పి గెలవడానికి ఛాన్స్ దొరికిందనే చెప్పాలి.

 

10 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు చెమటలు పట్టిస్తున్న ఆ టీడీపీ లీడర్ ఎవరు ?

అయితే ఇక్కడ ఎవరు టి‌డి‌పి నుంచి బరిలో దిగుతారో అర్ధం కాకుండా ఉంది. గత ఎన్నికల్లో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు టి‌డి‌పి ఇంచార్జ్ గా మాలెపాటి సుబ్బానాయుడు ఉన్నారు. అటు బీదా రవిచంద్రా యాదవ్ ఉన్నారు. మరి వీరిలో ఎవరికి సీటు వస్తుంది..ఎవరు టి‌డి‌పిని గెలిపిస్తారో చూడాలి.

Tags: AP, ap politics, chandra babu, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp