శంక‌ర్ జెంటిల్‌మ‌న్ సినిమాకు ముందు ఆ స్టార్ హీరోను అనుకున్నారా… ఎందుకు హ్యాండ్ ఇచ్చాడు ?

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన తొలి సినిమా జెంటిల్మెన్. ఈ సినిమా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాకు ముందుగా హీరోగా అనుకున్నది యాక్షన్ కింగ్ అర్జున్ ని కాదన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అర్జున్ కన్నా చాలామంది హీరోల చేతుల్లోకి వెళ్లిన జెంటిల్మెన్ కథ‌ అటూ ఇటూ మలుపులు తిరిగి చివరకు అర్జున్ దగ్గరకు వచ్చి ఆగింది. శంకర్ తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తండ్రి ఎస్సీ చంద్రశేఖర్ దగ్గర 14 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.

GENTLEMAN | FULL TELUGU MOVIE | ARJUN | MADHU BALA | SUBHASHRI | TELUGU  CINEMA CLUB - YouTube

ఒకే దర్శకుడు దగ్గర ఇన్ని సినిమాలుకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఘనత కూడా శంకరకే దక్కుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ తర్వాత.. కో డైరెక్టర్ గా ఎంతో అనుభవం సంపాదించిన తర్వాత శంకర్ దర్శకత్వ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ ఓరియంటెడ్‌ సబ్జెక్టు ముందుగా ఆయన రాసుకున్నారు. అయితే అది కమర్షియల్ గా అంత సక్సెస్ కాదని మిత్రులు చెప్పడంతో అప్పుడు మిత్రులు సలహాలతో శంకర్ జెంటిల్మెన్ కథ‌ రాసుకున్నారు.

ఈ కథ నిర్మించే నిర్మాత కోసం ఆయన మద్రాసులో చాలామంది నిర్మాతలను కలిశారు. అందరూ కథ బాగుందని చెబుతున్నా.. తాము సినిమా చేస్తామని.. నిర్మిస్తామని హామీ ఇస్తున్నవారు దొరకటం లేదు. ముందుగా కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కథ విని ఈ సినిమాలో నేను చేస్తాను.. అయితే నిర్మాతను మీరే చూసుకోండని చెప్పారు. దీంతో శంకర్‌కు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో మలయాళ నిర్మాత కుంజుమోహన్ తమిళంలో ఓ సినిమా తీస్తున్నారని శంకర్ కు తెలియడంతో.. ఆయన దగ్గరికి వెళ్లి జెంటిల్మెన్ కథ‌ వినిపించారు. ఆయ‌న ఓకే చెప్పారు.

I-T raids and RK Nagar Bypolls: Who is Sarath Kumar? From Cycle Boy to Mr.  Madras, 6 interesting facts about this leading actor! | The Financial  Express

అయితే అదే టైంలో శరత్ కుమార్‌కు కాల్ షీట్ల సమస్య రావడంతో వేరే హీరోని చూసుకోమని శంకర్‌కు చెప్పారు. దీంతో మళ్లీ హీరోల వేట మొదలుపెట్టారు. శంకర్ రాజశేఖర్, తమిళ్ హీరో కార్తీక్ తో సహా ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరికీ జెంటిల్మెన్ కథ‌ నచ్చలేదు. బ్రాహ్మణుడు దోపిడీలు చేయడం ఏంటి ? అని చాలామంది సందేహం వ్యక్తం చేశారు. అదే సమయంలో అర్జున్ నటించిన ఒక సినిమా రిలీజ్ అయింది.

ఆ సినిమా చూసిన శంకర్‌కు తన క‌థ‌కు అర్జున్ సరిపోతాడని భావించారు. వెంటనే అర్జున్‌ని కలిసి కథ చెప్పడంతో అర్జున్ ఒప్పేసుకున్నారు. దీంతో అర్జున్ హీరోగా జెంటిల్మెన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఒక్క సినిమాతో తమిళంలో కాదు తెలుగులోనూ అటు నార్త్ లోను శంకర్‌కు, అర్జున్ కు ఇద్దరికీ పెద్ద స్టాండర్డ్ తెచ్చి పెట్టింది. అయితే ఈ సినిమా మిస్ చేసుకున్న తర్వాత చాలామంది హీరోలు ఎంతో బాధపడ్డారు. అది వారి బ్యాడ్ లక్ అని చెప్పాలి.

Rajasekhar Movies, News, Photos, Age, Biography

Tags: film news, filmy updates, gentel man movie, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news